IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కోహ్లీ సేన..!

ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు.

IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కోహ్లీ సేన..!
Teamindia Won By 157 Runs In The Oval Test
Follow us

|

Updated on: Sep 06, 2021 | 9:35 PM

India vs England 2021: ఓవల్ టెస్టులో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. 368 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో చివరి రోజు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం.. తొలి సెషన్‌లో బాగానే ఆడింది. అనంతరం  రెండు సెషన్స్‌లో విఫలమైంది. లంచ్ తరువాత నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమికి చేరువైంది. ఇంగ్లండ్ టీం డ్రా కోసం ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. ఇంగ్లండ్ టీంలో రోరీ బర్న్ 50, హమీద్ 63 పరుగులతో నిలిచారు. అనంతరం కెప్టెన్ రూట్ (36) కొద్దిసేపు నిలబడినా.. భారత బౌలింగ్‌ ముందు తలవంచక తప్పలేదు. భారత బౌలర్లలో యాదవ్ 3, బుమ్రా, జడేజా, శార్దుల్ తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ టీం నడ్డి విరిచారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందంజలో నిలిచింది.

అయితే, అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. శార్దుల్‌ ఠాకూర్‌ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుతంగా ఆడి భారత్ భారీ స్కోర్ సాధించేందుకు తన వంతు సహాయం అందించాడు. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) కూడా రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 3 వికెట్లు తీశాడు.

50 ఏళ్ల నిరీక్షణకు తెర ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. దీంతో నేటి విజయం భారత్‌కు చారిత్రాత్మకమైందిగా నిలిచింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయంగా నిలిచింది. మరలా ఇన్నాళ్లకు కోహ్లీ సేన 2021లో విజయాన్ని నమోదు చేసింది.

1971 తర్వాత టీమిండియా 8 మ్యాచ్‌లు ఆడింది. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. భారత జట్టు గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) ఘోర పరాజయాల పాలైంది. 2011లో ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఓడిన భారత్.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో ఓడిపోయింది. అలాగే 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో చిత్తయింది.

Also Read: ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ రేసులో భారత స్టార్ బౌలర్, ఇంగ్లండ్ కెప్టెన్

Viral Video: ‘కాశ్మీరీ పులావ్’లో కాశ్మీర్ ఉంటుందా.. ప్రశ్నించిన చాహల్‌ భార్య..! ఎందుకో తెలుసా?

IND vs ENG 4th Test Day 5 Highlights: ఓవల్ టెస్టులో భారత్ ఘన విజయం.. 157 పరుగుల తేడాతో చిత్తయిన ఇంగ్లండ్