AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ రేసులో భారత స్టార్ బౌలర్, ఇంగ్లండ్ కెప్టెన్

ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు బరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నామినేట్ అయ్యాడు.

ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ రేసులో భారత స్టార్ బౌలర్, ఇంగ్లండ్ కెప్టెన్
Bumrah And Joe Root
Follow us
Venkata Chari

|

Updated on: Sep 06, 2021 | 8:31 PM

ICC Mens Player Of Month: ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు బరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నామినేట్ అయ్యాడు. ఆగస్టు నెలకు గాను ఈ నామినేషన్లు జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. బుమ్రాతో పాటు పాక్ పేసర్ షాహిన్ అఫ్రిది, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు బరిలో పోటీపడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ బుమ్రా.. లార్డ్స్‌ టెస్టులో బ్యాటింగ్‌లోనూ రాణించాడు. మరో పేసర్‌ మహ్మద్ షమీతో కలిసి 9వ వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ టెస్టులో భారత్ ఘన విజయాన్ని సాధించింది.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో వరుస సెంచరీలతో దూసుకెళ్తున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్న రూట్.. తొలి మూడు టెస్టుల్లోనూ మూడు సెంచరీలు బాదేశాడు. 105.81 సగటుతో 528 పరుగులు సాధించాడు.

మరోవైపు వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో షాహిన్‌ అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో ఏకంగా 10 వికెట్లు సాధించాడు.

మెన్స్‌తోపాటు ఐసీసీ వుమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ముగ్గరు మహిళా క్రికెటర్లు ఎంపిక అయ్యారు. అయితే ఇందులో ఇద్దరు ఐర్లాండ్‌ దేశానికి చెందినవారు కావడం విశేషం. మరొకరు థాయ్‌లాండ్‌కు చెందిన ప్లేయర్. గాబీ లూయిస్‌, ఈమియర్‌ రిచర్డ్‌సన్‌, నట్టాయా బూచాతమ్‌లు ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

Also Read: Viral Video: ‘కాశ్మీరీ పులావ్’లో కాశ్మీర్ ఉంటుందా.. ప్రశ్నించిన చాహల్‌ భార్య..! ఎందుకో తెలుసా?

IND vs ENG 4th Test Day 5 Live: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. వోక్స్ (18) ఔట్.. స్కోర్ 193/8

అరంగేట్రంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో రికార్డులు.. ఆఫ్‌కట్టర్‌తో భారత్‌కు చెమటలు పట్టించాడు.. ఆ బౌలర్ ఎవరంటే?