AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరంగేట్రంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో రికార్డులు.. ఆఫ్‌కట్టర్‌తో భారత్‌కు చెమటలు పట్టించాడు.. ఆ బౌలర్ ఎవరంటే?

ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. తన మొదటి మ్యాచ్‌లో లేదా మొదటి సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించేలా కోరుకుంటాడు.

అరంగేట్రంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో రికార్డులు.. ఆఫ్‌కట్టర్‌తో భారత్‌కు చెమటలు పట్టించాడు.. ఆ బౌలర్ ఎవరంటే?
Mustafizur Rahman
Venkata Chari
|

Updated on: Sep 06, 2021 | 8:42 AM

Share

Mustafizur Rahman: ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. తన మొదటి మ్యాచ్‌లో లేదా మొదటి సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించేలా కోరుకుంటాడు. కానీ, ఈ కల చాలా కొద్ది మంది క్రికెటర్లకు మాత్రమే నెరవేరింది. వారిలో ఒకరు బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్. తన బౌలింగ్ వైవిధ్యంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం తన అలవాటుగా మార్చుకున్నాడు. ఆఫ్-కట్టర్, స్లో బాల్స్‌తో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను కూడా ఆశ్చర్యపరిచేవాడు. ఇందులో భారత బ్యాట్స్‌మెన్ వరుసలో మొదటి వరుసలో ఉన్నారు. నేడు ముస్తాఫిజుర్ పుట్టిన రోజు. అంటే 6 సెప్టెంబర్ 1995 న జన్మించిన ముస్తాఫిజుర్.. నేడు తన 26 వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నాడు.

ముస్తఫిజుర్ రెహమాన్ అంతర్జాతీయ అరంగేట్రం 2015 లో జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌‌లో ఎంట్రీ ఇచ్చాడు. 24 ఏప్రిల్ 2015 న ఆడిన తన మొదటి మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్ రూపంలో 2 పెద్ద వికెట్లు తీసుకుని, ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం టీమిండియాతో తన తొలి వన్డే సిరీస్ ఆడాడు. ఈ సిరీస్‌లోనే తన పేరు ప్రపంచానికి తెలిసేలా చేశాడు. టీమిండియాపై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలవడం కూడా ఇదే మొదటిసారి. ఇందులో కీలక పాత్ర పోషించింది మాత్రం ముస్తాఫిజుర్ రెహమాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో రెండు జట్ల మధ్య భారీ వ్యత్యాసాన్ని సృష్టించాడు. ఈ సిరీస్‌లో, ముస్తాఫిజుర్ తన ఆఫ్-కట్టర్, స్లో బంతులతో భారత బ్యాట్స్‌మెన్లపై దాడి చేశాడు. భారత్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో ముస్తాఫిజుర్ మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. మొదటి 2 వన్డేల్లో 11 వికెట్లు తీసి కొత్త రికార్డు సృష్టించాడు.

తొలి ఏడాదిలో 36 వికెట్లు.. ముస్తాఫిజుర్ అరంగేట్రం చేసిన ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. 13.63 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తర్వాత, ముస్తాఫిజుర్ తన రెండో వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఇందులో 5 వికెట్లు తీసి జట్టు 2-1 విజయాన్ని సాధించేందుకు సహాయపడ్డాడు. దీని తరువాత దక్షిణాఫ్రికాతోనే తన తొలి టెస్టును ఆడాడు. ఇందులో 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వన్డే, టెస్ట్ అరంగేట్రం రెండింటిలోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న ప్రపంచంలో మొట్టమొదటి క్రికెటర్ ముస్తాఫిజుర్ కావడం విశేషం.

7 ఏళ్లలో 225 వికెట్లు.. 2019 ప్రపంచ కప్‌లో ముస్తఫిజుర్ రహమాన్ చెలరేగిపోయాడు. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో బంగ్లా తరుపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారాడు. భారల్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 5-5 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ క్రికెట్ కెరీర్ కేవలం 7 సంవత్సరాలే. ఈ సమయంలో బంగ్లాదేశ్ తరఫున వన్డేల్లో 127 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని పేరుపై 30 వికెట్లు ఉండగా, టీ20 ఇంటర్నేషనల్‌లో 68 వికెట్లు నమోదయ్యాయి. అంటే మొత్తం 130 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 225 వికెట్లను పడగొట్టాడు.

Also Read:

IND vs ENG: ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్.. 86 ఏళ్ల రికార్డుకు బీటలు.. ఆ టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?

Ind vs Eng: ఓవల్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 30 ఏళ్ల తరువాత అలా చేసిన మొదటి జట్టు మనదే..!

IND vs ENG: టీమిండియాను వెంటాడుతోన్న గాయాలు.. మరో ఇద్దరు కీలక ప్లేయర్లు కూడా..!