AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng: ఓవల్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 30 ఏళ్ల తరువాత అలా చేసిన మొదటి జట్టు మనదే..!

ఓవల్ మైదానంలో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడం ద్వారా ఇంగ్లండ్‌పై భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Ind vs Eng: ఓవల్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 30 ఏళ్ల తరువాత అలా చేసిన మొదటి జట్టు మనదే..!
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Sep 06, 2021 | 8:00 AM

Share

Ind vs Eng: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు బ్యాటింగ్ విఫలమైందనే విమర్శలు చాలానే వచ్చాయి. మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో, కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. అలాగే నాల్గవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 191 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్‌లో దుమ్ము దులిపింది. ఇంగ్లండ్ బౌలర్లకు చెమలు పోయించి మరీ భారీ స్కోర్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడి, ఎన్నో ఏళ్ల రికార్డుల తుప్పు వదిలించారు. ఈ మ్యాచ్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఓవల్‌లో 1991 నుంచి రెండో ఇన్నింగ్స్‌లో 132.5 ఓవర్లకు మించి బ్యాటింగ్ చేయనందున ఇది రికార్డుగా మారింది.

భారతదేశానికి ముందు, వెస్టిండీస్ 1991లో ఈ మైదానంలో 132.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. అప్పటి నుంచి ఈ మైదానంలో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏ విదేశీ జట్టు కూడా ఇన్ని ఓవర్లు ఆడలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లే కాకుండా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు సత్తా చూపడంతో ఈ రికార్డు సాధ్యమైంది.

2019 తర్వాత.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 466 పరుగులు చేసింది. 2019 తర్వాత టెస్టుల్లో భారత్‌కు ఇది అత్యధిక స్కోరుగా నిలిచింది. అంతకుముందు, ఇండోర్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించడం విశేషం.

మ్యాచ్ పరిస్థితి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 290 పరుగులు చేసి, తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. భారీ స్కోర్ చేసి, ఇంగ్లండ్ పై 368 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 127 పరుగులతో విదేశాల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. రోహిత్‌తో పాటు, చేతేశ్వర్ పుజారా 61 పరుగులు సాధించాడు. ఇద్దరూ 153 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రిషబ్ పంత్ లోయర్ ఆర్డర్‌లో 50 పరుగులు చేశాడు. అయితే మరోసారి శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్‌లో రాణించాడు. ఠాకూర్ 60 పరుగుల ఇన్నింగ్స్‌తో కీలకంగా మారాడు. 72 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో భారీ స్కోర్‌కు తనవంతు సహాయం చేశాడు. పంత్ 106 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు బాదాడు. ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా చివర్లో కొద్దిసేపు బౌండరీలతో చెలరేగారు. బుమ్రా 24 పరుగులు చేయగా, ఉమేశ్ 25 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 పరుగులు చేశాడు. నేడు ఇంగ్లండ్ గెలవాలంటే మరో 291 పరుగులు చేయాలి.

Also Read:

IND vs ENG: టీమిండియాను వెంటాడుతోన్న గాయాలు.. మరో ఇద్దరు కీలక ప్లేయర్లు కూడా..!

IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియాదే విజయం.. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లనున్న 3 కారణాలేంటో తెలుసా..?

Shami-Pant: మొహమ్మద్ షమీని ఎగతాళి చేసిన రిషబ్ పంత్.. బదులుగా ఫన్నీ కౌంటర్‌తో నవ్వులు పూయించిన పేసర్..!