IND vs ENG: ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్.. 86 ఏళ్ల రికార్డుకు బీటలు.. ఆ టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?

Venkata Chari

Venkata Chari |

Updated on: Sep 06, 2021 | 8:07 AM

ఇంగ్లండ్ పర్యటనలో శార్దూల్ ఠాకూర్ 117 పరుగులు సాధించాడు. అంతకుముందు నాటింగ్‌హామ్ టెస్ట్‌లో కూడా ఆడాడు. కానీ, అప్పుడు ఖాతా తెరవలేకపోయాడు. ఓవల్ టెస్టులో మాత్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో యాభై పరుగులు చేసి తన సత్తా చాటాడు.

IND vs ENG: ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్.. 86 ఏళ్ల రికార్డుకు బీటలు.. ఆ టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా..?
Shardul Thakur Fifty

Shardul Thakur: ఇంగ్లండ్ పర్యటనలో శార్దూల్ ఠాకూర్ తన బ్యాటింగ్‌తో సందడి చేస్తున్నాడు. ఓవల్‌లో జరుగుతున్న నాల్గవ టెస్టులో శార్దుల్ రెండు ఇన్నింగ్స్‌లలో యాభై పరుగులు చేసి, టీమిండియాను బరిలోని నిలిచేందుకు కీలకంగా మారాడు. శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, యాభై పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేశాడు. దీంతో ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేసి, ఒక టెస్ట్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో యాభై పరుగులు సాధించిన ఘనతను సాధించాడు. ఈ రికార్డు సాధించిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. శార్దూల్ ఠాకూర్‌తో పాటు, హర్భజన్ సింగ్, వృద్ధిమాన్ సాహా కూడా ఉన్నారు. అయితే ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ మాత్రం శార్దులే కావడం విశేషం. శార్దూల్ ఠాకూర్ 9 వ వికెట్‌కు రిషబ్ పంత్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

శార్దూల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఇది రెండో వేగవంతమైన అర్ధ సెంచరీ. అలాగే ఇంగ్లండ్‌లో వేగవంతమైనది నిలిచింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను అనేక రికార్డులు సృష్టించాడు. 2015 తర్వాత ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో యాభై పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. శార్దుల్ కంటే ముందు, విరాట్ కోహ్లీ 2018 పర్యటనలో బర్మింగ్‌హామ్, నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండు ఇన్నింగ్స్‌లలో భారత కెప్టెన్ 50 కి పైగా పరుగులు సాధించాడు.

86 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌లో.. 2015 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను పరిశీలిస్తే, రెండు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 50 ప్లస్ స్కోర్ చేసిన మూడో భారతీయుడిగా ఠాకూర్ నిలిచాడు. కోహ్లీతో పాటు, 2018 లో అడిలైడ్‌లో, 2021 లో సిడ్నీ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో చెతేశ్వర్ పుజారా 50 ప్లస్ సాధించాడు. మరోవైపు, ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాట్స్‌మెన్‌గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. శార్దుల్ కంటే ముందు, 1935 లో, ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఎరిక్ డాల్టన్ 117, 57 నాటౌట్‌తో నిలిచాడు. అంటే దాదాపు 86 సంవత్సరాల తరువాత ఒక విదేశీ బ్యాట్స్‌మెన్ ఎనిమిదవ స్థానంలో బరిలోకి దిగి ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో యాభై ప్లస్ పరుగులు చేయగలిగాడు.

ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో శార్దూల్ ఠాకూర్ 117 పరుగులు సాధించాడు. అంతకుముందు నాటింగ్‌హామ్ టెస్ట్‌లో కూడా ఆడాడు. కానీ, ఖాతా తెరవలేకపోయాడు. ఓవల్ టెస్టులో మాత్రం రెండు సార్లు యాభై పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలకంగా నిలిచాడు.

Also Read: Ind vs Eng: ఓవల్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 30 ఏళ్ల తరువాత అలా చేసిన మొదటి జట్టు మనదే..!

IND vs ENG: టీమిండియాను వెంటాడుతోన్న గాయాలు.. మరో ఇద్దరు కీలక ప్లేయర్లు కూడా..!

IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియాదే విజయం.. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లనున్న 3 కారణాలేంటో తెలుసా..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu