IND vs ENG: టీమిండియాను వెంటాడుతోన్న గాయాలు.. మరో ఇద్దరు కీలక ప్లేయర్లు కూడా..!
Pujara-Rohit: రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా భారత రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే, ఒకే సమయంలో ఇద్దరూ గాయపడడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది.
IND vs ENG: ఓవల్‌లో ఇంగ్లండ్, ఇండియా టీంల మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ నుంచి భారత్‌కు చేదు వార్త అందింది. రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా పూర్తిగా ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. దీని కారణంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు నాల్గవ రోజు ఆటలో ఫీల్డింగ్‌లో కనిపించలేదు. రోహిత్ శర్మ ఎడమ మోకాలు, పుజారా ఎడమ చీలమండలో నొప్పితో బాధ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇద్దరూ బరిలోకి దిగలేదు. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియాలో వెల్లడించింది. నాల్గవ రోజు ఆటలో భారత్ తన ఇన్నింగ్స్‌ను 466 పరుగుల వద్ద ముగించింది. దీని తర్వాత ఈ వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ కోసం మైదానంలోకి వచ్చాడు. నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై 368 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. టీమిండియా భారీ స్కోరును చేరుకోవడంలో రోహిత్, పుజారా కీలక పాత్ర పోషించారు.
కీలక భాగస్వామ్యం.. భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించగా, పుజారా యాభై పరుగులు చేశాడు. ఇద్దరూ మూడో రోజు రెండో వికెట్‌కు 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా భారీ స్కోర్ సాధించేందుకు సహాయపడ్డారు. ఈ సమయంలో, ఇంగ్లండ్‌లో రోహిత్ తన టెస్టు సెంచరీని నమోదు చేయగా, పుజారా ఈ సిరీస్‌లో రెండో అర్ధ సెంచరీని సాధించాడు. అయితే, బ్యాటింగ్ సమయంలో, ఇద్దరూ ఫిజియో సహాయం తీసుకోవాల్సి వచ్చింది. పుజారా తన ఎడమ కాలికి మైదానంలోనే చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో, రోహిత్ శర్మ బ్యాటింగ్ సమయంలో ఇంగ్లీష్ బౌలర్ల దాడిలో చాలాసార్లు గాయపడ్డాడు.
నేటి ఆటపై స్పష్టత లేదు.. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా మైదానంలోకి రారు. రోహిత్ ఎడమ మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడు. పుజారాకు ఎడమ చీలమండతో ఇబ్బంది పడుతున్నాడు. బీసీసీఐ వైద్య బృందం వీరి ఫిట్‌నెస్‌ను చూసుకుంటున్నారు. అయితే, ఐదవ రోజు కూడా ఇద్దరూ ఫీల్డింగ్ కోసం బరిలోకి దిగుతారా.. లేదా అనేది చూడాలి. దీనిపై భారత బోర్డు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ అని తేలిన సమయంలో రోహిత్, పుజారా భారత జట్టుకు పూర్తిగా ఫిట్‌గా లేరనే వార్తలు రావడంతో భారత శిబిరంలో కొంత ఆందోళన నెలకొంది.
UPDATE – Rohit Sharma and Cheteshwar Pujara will not take the field. Rohit has discomfort in his left knee while Pujara has pain in his left ankle. The BCCI Medical Team is assessing them. #ENGvIND pic.twitter.com/ihMSUPR7Im
— BCCI (@BCCI) September 5, 2021
Also Read:
IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియాదే విజయం.. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లనున్న 3 కారణాలేంటో తెలుసా..?