Viral Video: రన్ అవుట్ కావడంతో బ్యాట్,హెల్మెట్‌ని విసిరికొట్టిన బ్యాట్స్‌మెన్..! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్‌లో ఊహించని విధంగా బ్యాట్స్‌మెన్ ఔట్ అయితే అసంతృప్తి వ్యక్తం చేయడం సాధారణం.ఇది ఆటగాళ్లలో తరచుగా
Viral Video: ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్‌లో ఊహించని విధంగా బ్యాట్స్‌మెన్ ఔట్ అయితే అసంతృప్తి వ్యక్తం చేయడం సాధారణం.ఇది ఆటగాళ్లలో తరచుగా కనిపిస్తుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఓవల్ టెస్ట్‌లో కూడా ఇది జరిగింది. భారత బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ అనుకోకుండా అవుట్ కావడంతో అంపైర్‌పై కోపం వ్యక్తం చేశాడు. తర్వాత అలా చేసినందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. అయితే ఇది ఓవల్ టెస్ట్ కాదు వెస్టిండీస్‌లో ఆడుతున్న CPL 2021లో.
సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా మధ్య కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సెప్టెంబర్ 5 న జరిగింది. ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ బ్యాట్స్‌మన్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ నాన్ స్ట్రైకర్‌లో ఉన్న పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ కారణంగా రనౌట్ అవుతాడు. దీంతో అతడు అందరు చూస్తుండగానే కోపం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లోని 10 వ ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అవుతాడు.
అయితే నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న పాకిస్తానీ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ రెండో పరుగు కోసం క్రీజు నుంచి కదలడు. దీంతో రూథర్ పోర్డ్ రనౌట్ అవుతాడు. అయితే ఇలా అవుట్ కావడం రూథర్ పోర్డ్‌కి నచ్చలేదు. దీంతో కోపంతో పెవిలియన్‌కి వెళుతూ తన అసంతృప్తిని బయటపెట్టాడు. కోపంతో చేతిలోని బ్యాట్‌ని, హెల్మెట్‌ని, గ్లౌస్‌ని నేలకేసి కొడుతాడు. అప్పటికి రూథర్ పోర్డ్ 16 బంతుల్లో 14 పరుగులు చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కామెంట్లు, షేర్ చేస్తున్నారు. కొంతమంది క్రీడాకారులు ఆటలో ఇవన్ని సహజమని కామెంట్ చేశారు. కొంతమంది ఆసిఫ్ అలీ తీరును తప్పుబట్టారు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.
Give that man an #angosturachill ?#SKNPvSLK #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/Q9ZHoKs5Ek
— CPL T20 (@CPL) September 5, 2021