AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: టీ 20 వరల్డ్ కప్‌ జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. 15 మందిలో కేవలం ఐదుగురే బ్యాట్స్‌మెన్లు..

ICC Mens T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది.

T20 World Cup 2021: టీ 20 వరల్డ్ కప్‌ జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. 15 మందిలో కేవలం ఐదుగురే బ్యాట్స్‌మెన్లు..
Pakistan Team
uppula Raju
|

Updated on: Sep 06, 2021 | 1:49 PM

Share

ICC Mens T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. కానీ ఇందులో కేవలం 5 గురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లకు మాత్రమే చోటు లభించింది. వీరితో పాటు ఇద్దరు వికెట్ కీపర్‌లు, నలుగురు ఆల్ రౌండర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ముగ్గురిని మాత్రం రిజర్వ్‌లో ఉంచారు. పాకిస్తాన్ జట్టు టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనడమే కాకుండా న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టు అక్టోబర్ 24 న దుబాయ్‌లో భారత్‌తో తలపడనుంది. కానీ అంతకు ముందు లాహోర్, రావల్పిండి హోం గ్రౌండ్స్‌లో 7 టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 14 వరకు జరుగుతాయి. ఆసిఫ్ అలీ, ఖుష్దీల్ షా పాకిస్థాన్ జట్టుకు తిరిగి వచ్చారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల చేరికతో జట్టు మిడిల్ ఆర్డర్‌కి ఊపు వచ్చింది. ఈ ఆటగాళ్లు వారి దేశీయ ప్రదర్శన ఆధారంగా టి 20 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యారు.

ఆసిఫ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో జింబాబ్వేతో పాకిస్థాన్ తరపున చివరి టీ 20 మ్యాచ్ ఆడాడు. అదే సమయంలో ఖుష్దీల్ షా ఈ ఏడాది ప్రారంభంలో లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. టీ 20 లో ఆసిఫ్ అలీ స్ట్రైక్ రేట్ 147 కాగా, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ ఖుష్దిల్ షా స్ట్రైక్ రేట్ 134 గా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ ” జట్టు ఎంపికలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించాం కానీ అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాం. ప్రస్తుతం జట్టు కొత్త, పాత ఆటగాళ్ల కలయికతో ఉంది” అన్నారు.

మహారాష్ట్ర రైతు సాధించాడు..! హిమాచల్ ప్రదేశ్‌ ఆపిల్‌ని వేడి ప్రాంతమైన నాసిక్‌లో పండించాడు..

Country Club: కంట్రీ క్లబ్‌కు జరిమానా.. మానసిక వేదనకు పరిహారం.. ఖర్చుల కింద మరికొంత చెల్లించండి.. కన్స్యూమర్ ఫోరమ్ ఆదేశం..

Triangle Love Story: ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..