Country Club: కంట్రీ క్లబ్‌కు జరిమానా.. మానసిక వేదనకు పరిహారం.. ఖర్చుల కింద మరికొంత చెల్లించండి.. కన్స్యూమర్ ఫోరమ్ ఆదేశం..
కంట్రీ క్లబ్ కు జరిమానా విధించింది కన్స్యూమర్ ఫోరమ్. సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న సభ్యుడికి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించని కంట్రీ క్లబ్‌పై జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా వేసింది.
కంట్రీ క్లబ్ కు జరిమానా విధించింది కన్స్యూమర్ ఫోరమ్. సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న సభ్యుడికి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించని కంట్రీ క్లబ్‌పై జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా వేసింది. సభ్యత్వం తీసుకుంటే ఫిట్‌నెస్ సెంటర్లు, స్విమ్మింగ్ ఫూల్, హాలిడే ట్రావెల్ ప్యాకేజీలు తదితర సేవలు అందుకునే అవకాశం ఉంటుందంటూ కంట్రీక్లబ్ ప్రతినిధులు ఒత్తిడి చేయడంతో ఉప్పల్‌కు చెందిన వై.వెంకట శ్రీనివాసరెడ్డి సభ్యత్వం తీసుకున్నారు. ఇందుకోసం రూ.56వేలు చెల్లించారు. హబ్సిగూడలో ఫిట్‌నెస్ సెంటర్ ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ పూర్తిగా పాడైపోయిన దాని పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు.
తన సభ్యత్వాన్ని రద్దు చేసి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మెయిల్ ద్వారా ప్రతివాదులను కోరారు. వారి నుంచి స్పందన రాకపోయేసరికి బేగంపేట్‌లోని కార్యాలయానికి వెళ్లి లేఖ ద్వారా అభ్యర్థించారు. కొన్నాళ్లకు విడతలవారీగా 90 రోజుల్లోగా డబ్బు తిరిగిస్తామని చెప్పిన ప్రతినిధులు ఆ హామీని మరిచిపోయారు.
దీంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్-3, సాక్ష్యాధారాలు పరిశీలించి నిబంధనల ప్రకారం రూ.52,200 జరిమానతోపాటు 18శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా.. వినియోగదారుడి మానసిక వేదనకు పరిహారంగా రూ.10వేలు చెల్లించాలని పేర్కొంది. అంతేకాకుండా కేసు ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి: డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్ బండి’ రాజయ్య స్టెప్పులు
Mysterious Fever: చిన్నారులను వెంటాడుతున్న మరో అంతుచిక్కని జ్వరం.. 48 గంటల్లో 50 మంది మృతి..