అనుమతి లేని కట్టడాల కూల్చివేతలు.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్

మంచిర్యాల జిల్లాలో కొత్త పురపాలక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత.. అనుమతిలేని నిర్మాణాలపై కొరడా ఝళిపించడానికి...

అనుమతి లేని కట్టడాల కూల్చివేతలు.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్

అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి.. టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు కలెక్టర్. ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడానికి వెళ్తే.. అధికారులకు అడ్డుపడుతున్నారు. అడ్డుకుంటుంది ఎవ్వరూ.. ఎక్కడ. ఈ స్టోరీలో చదువుదాం.. వివరాల్లోకి వెళ్లితే.. మంచిర్యాల జిల్లాలో కొత్త పురపాలక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత.. అనుమతిలేని నిర్మాణాలపై కొరడా ఝళిపించడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఏడు పురపాలక సంఘాల్లో టాస్క్ ఫోర్స్ బృందా లను కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. అధికారుల విధులకు స్థానిక పాలకవర్గాలే అడ్డుపడుతున్నాయి.

అనుమతి లేని భవనాలను అధికారులు కూల్చి వేయడానికి వెళ్తే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతున్నారు. ఇప్పటికే మంచిర్యాల, బెల్లంపల్లి చెన్నూర్ లో చేపట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రయత్నించగా లోకల్ లీడర్స్ అడ్డుపడి ఆటంకాలు సృష్టించారు.

మంచిర్యాల జిల్లాలోని పురపాలక సంఘాల్లో గతంలో నిర్మించిన పాత నివాస, వాణిజ్య గృహాల్లో 30 నుంచి 50 శాతం వాటికి మున్సిపాలిటి పర్మిషన్స్ లేవు. దీంతో.. గతంలో ఇంటి నంబర్లు ఇచ్చి ప్రస్తుతం ఆస్తి పన్ను పై అదనంగా 100 శాతం పెనాల్టీ విధిస్తున్నారు.

మరో 25 శాతం ఇళ్లకు మున్సిపాలిటి అనుమతి ఉన్నప్పటికీ వాస్తు, తక్కువస్థలం కారణాలతో సెట్బ్యాక్ లేకుండానే నిర్మించారు. కొత్త పురపాలక చట్టం వచ్చిన తర్వాత జీఓ నెం. 101 ప్రకారం అనుమతిలేని ఇళ్లు కూల్చివేయడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు.

ఇందులో పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక విభాగం అధికారి, తహసీల్దార్, ఆగ్ని మాపక అధికారి, ఆర్ అండ్ బీ అధికారి కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇంటి నిర్మాణానికి టీఎస్ బీ-పాస్ లో దరఖాస్తు చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను కూల్చి వేసే బాధ్యత వారికి అప్పగించారు.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు

Click on your DTH Provider to Add TV9 Telugu