Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు

యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో విచారణ కోనసాగుతోంది. నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతించింది కోర్టు. 

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు
Rahul Murder
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 08, 2021 | 7:22 AM

యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో విచారణ కోనసాగుతోంది. నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతించింది కోర్టు. ప్రధాన నిందితుడు కొరాడ విజయ్ తోపాటు అనంత్, బాబూరావు, రాజాబాబులను కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మంగళవారం రోజు నిందితులను విచారించిన మాచవరం పోలీసులు.. ఈ రోజు కూడా కొనసాగించనున్నారు. ఇవాళ్టితో  విచారణ ముగియనుంది. విచారణ ముగిసిన తర్వాత నిందితులను కోర్టులో తిరిగి హాజరు పరచనున్న పోలీసులు. రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బిజినెస్ మ్యాన్ రాహుల్ మర్డర్ మిస్టరీలో మనీ మ్యాటర్సే కారణమని ఇప్పటికే విజయవాడ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కోరాడ విజయ్‌తో పాటు.. మరో ఆరుగురిని విచారిస్తున్న పోలీసులు వారి నుంచి మరింత సమాచారాన్ని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

కోరాడ విజయ్‌ కుమార్‌ సూత్రధారి కాగా.. కోగంటి సత్యం పాత్ర కూడా స్పష్టంగా తేలిందన్నారు సీపీ శ్రీనివాస్. కోరాడ విజయ్‌కుమార్‌ 1991 నుంచి చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేస్తుండగా.. గాయత్రి భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల్లో కోరాడ ఓటమితో నష్టాల్లో కూరుకుపోయారు. అప్పులు తీర్చేందుకు.. ఫ్యాక్టరీని విక్రయించి లేదంటే తన వాటా ఇవ్వాల్సిందిగా రాహుల్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు కోరాడ.

డబ్బు ఇవ్వకుండా, షేర్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా రాహుల్‌ దాటేస్తూ రావడంతో కోగంటి సత్యం వద్దకు వెళ్లాడు. కోగంటి సత్యం ఈ ఫ్యాక్టరీలో షేర్స్‌ కొనుగోలు చేసి తను కూడా భాగస్వామి కావాలనుకున్నాడు. కాల్ డేటా ఆధారంగా హత్యలో ఎవరి పాత్ర ఉందో తెలుసుకున్న పోలీసులు. A1 కోరాడ విజయ్‌తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

కోగంటి సత్యం, కోరాడ విజయ్‌కుమార్‌ ఒకటి రెండు సార్లు రాహుల్‌ను బెదిరించారు. అప్పటికీ రాహుల్‌ సెటిల్‌ చేయలేదు. ఇదే సమయంలో చాగర్ల గాయత్రి కూతురికి ఢిల్లీలో మెడికల్‌ పీజీ సీటు ఇప్పిస్తానని రాహుల్‌ 6 కోట్లు తీసుకున్నాడు. సీటు ఇప్పించకపోగా.. డబ్బు సైతం తిరిగి ఇవ్వలేదు. ఆ విషయంలో వారు అసహనంతో ఉన్నారు.

ఈ క్రమంలో ఈనెల 18న 50 లక్షలు ఇస్తానని గాయత్రికి చెప్పి రాహుల్‌ సీతారాంపురంలోని చిట్‌ఫండ్స్‌ ఆఫీస్‌కు కారులో వెళ్లాడు. కోరాడ, కోగంటి.. రాహుల్‌ను బెదిరించడంతో పాటు, దాడి కూడా చేశారు. కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం హత్య చేశారని సీపీ తెలిపారు.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!