BoB Scam: గోల్డ్ గోల్ మాల్ కేసులో తీగలాగుతున్న బాపట్ల పోలీసులు.. తప్పించుకు తిరుగుతున్న అటెండర్ సుమంత్ రాజు
బ్యాంక్ ఆఫ్ బరోడా కాస్తా కరోడాలా మారినట్టుంది. అప్పుడు కలికిరి.. లేటెస్ట్‌గా బాపట్ల బ్రాంచ్. అక్కడ క్యాష్ గోల్ మాల్. ఇక్కడ గోల్డ్ గోల్ మాల్. బ్యాంక్ స్కామ్‌లో ఇంటి దొంగలే అసలు సూత్రదారులని తేలింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కాస్తా కరోడాలా మారినట్టుంది. అప్పుడు కలికిరి.. లేటెస్ట్‌గా బాపట్ల బ్రాంచ్. అక్కడ క్యాష్ గోల్ మాల్. ఇక్కడ గోల్డ్ గోల్ మాల్. అంతే తేడా. బాపట్లలో జరిగిన బ్యాంక్ స్కామ్‌లో ఇంటి దొంగలే అసలు సూత్రదారులని తేలింది. కానీ ఇందుకు ప్రధాన కారణమైన సూత్రదారి మాత్రం తప్పించుకుతిరుగుతున్నాడు. బాపట్లలో సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగు చూసిన 2.26 కోట్ల రూపాయల విలువైన బంగారు నగల గల్లంతు కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంక్ అటెండర్ సుమంత్ రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను చేతివాటం తో విడతలవారీగా కైవసం చేసుకున్న అటెండర్ సుమంత్ రాజు గత కొంతకాలంగా ఈ బంగారు నగలను స్థానికంగా ఉన్న ప్రైవేట్ తాకట్టు శాఖల్లో తన పేరుతో,స్నేహితుల పేర్లతో తాకట్టు పెట్టి 2 కోట్ల రూపాయల వరకూ సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
ఆన్లైన్ రమ్మీ , బెట్టింగ్ లలో చాలా సొమ్ము నష్టపోయి అప్పులు కూడా చేశాడని తెలుస్తోంది. నిందితుడు తాకట్టుపెట్టిన ప్రైవేట్ రుణ శాఖల్లోని సంబంధిత ఖాతాలను సీజ్ చేసి నిందితుడు సుమంత్ రాజు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దని ఎవరి బంగారు నగలను వారికి త్వరలోనే అందజేస్తామంటున్నారు పోలీసులు.
అసలు ఏం జరిగింది..
బ్యాంక్ ఆఫ్ బరోడా లో.. అటెండర్ల ఫ్రాడ్ సీజన్ నడుస్తున్నట్టుంది. మొన్నంటే మొన్న చిత్తూరు జిల్లా కలికిరి బ్రాంచ్ లో అలీఖాన్ అనే ఒక మెసెంజర్ కోటి. 78 లక్షల రూపాయలు నొక్కేసిన కేసులో బుక్కయ్యాడు. ఇక ఇదే బ్యాంకుకు సంబంధించిన బాపట్ల- బ్రాంచ్ లోనూ సేమ్ ఫ్రాడ్. కాకుంటే అక్కడ డబ్బు-ఇక్కడ బంగారం అంతే తేడా. మిగిలినదంతా ఒకటే. ఇక్కడ పని చేసే సుమంత్ రాజు అనే అటెండర్.. బ్యాంకులోని బంగారంపై కన్నేశాడు.
మొత్తం 5. 8 కిలోలు. ఈ బంగారం విలువ అక్షరాల 2 కోట్ల 26 లక్షల రూపాయలు. అటెండర్- సుమంత్ రాజు ఏడాది కాలంగా ఇక్కడ బంగారం మాయం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ విషయం ఆడిటింగ్ లో బయట పెట్టారు అధికారులు.
తన బండారం బట్టబయలైందని గుర్తించిన అటెండర్ సుమంత్ రాజు పరారయ్యాడు. ఈ వ్యవహారం పోలీస్టేషన్ కు చేరడంతో.. అతడికోసం గాలిస్తున్నారు. అటెండర్ కాజేసిన నగలను ఎట్టకేలకు తాము రికవరీ చేస్తామనీ.. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..