Mexico Earthquake: భారీ భూకంపం.. చిగురుటాకుల్లా వణికిన భవనాలు.. వీడియో..
Earthquake in Mexico : మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ భారీ భూకంపంతో
Earthquake in Mexico : మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ భారీ భూకంపంతో చాలా భవనాలు కొద్దిసేపు ఊగినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో ఉన్నట్లు సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వల్ల వందలాది కిలోమీటర్లదూరంలో భవనాలు ఊగాయి. రాజధానిలోని భవనాలు చిగురుటాకుల్లా వణికినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు.
ఈ భూకంపం వల్ల భారీ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి. ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భూకంపం సంభవించినప్పుడు అర్ధరాత్రి మెక్సికో నగరంలోని భవనాలు కదులుతుండగా.. లైటింగ్ ఫ్లాష్ అయిన వీడియోను పలువురు పంచుకుంటున్నారు.
Power flashes from the earthquake in #Mexico. ? @franz_gomez pic.twitter.com/ESXPpIgmSE
— Michael Armstrong (@KOCOMichael) September 8, 2021
కాగా.. 1985 సెప్టెంబరు 19వతేదీన సంభవించిన తీవ్ర భూకంపం వల్ల 10వేల మందికిపైగా మరణించగా, వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి. 2017లో సంభవించిన భూకంపంలో 370 మంది మరణించారు.
Also Read: