AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia Prison Fire: జైలులో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది ఖైదీలు సజీవదహనం..

Fire breaks in Indonesia Jail: ఇండోనేషియా దేశంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం బాంటెన్ ప్రావిన్స్ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర

Indonesia Prison Fire: జైలులో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది ఖైదీలు సజీవదహనం..
Fire breaks in Indonesia Jail
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 08, 2021 | 12:48 PM

Share

Fire breaks in Indonesia Jail: ఇండోనేషియా దేశంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం బాంటెన్ ప్రావిన్స్ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 40 మందికి పైగా ఖైదీలు మరణించారు. బాంటెన్ ప్రావిన్సు జైలులో బుధవారం తెల్లవారుజామున 1గంట నుంచి మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను రప్పించి చర్యలు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 40 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రియంతి తెలిపారు.

జైలులో చెలరేగిన మంటల అనంతరం.. సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు కొనసాగుతుందని రికా అప్రియంతి తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Taliban Rule: తాలిబాన్ ప్రభుత్వంలో ఆ మంత్రి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..అతనిపై ఎంత రివార్డు ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

Afghanistan Crisis:ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్.. ఇది తాత్కాలికమే!