Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot Juice Benefits: బీట్‌రూట్‌ జ్యూస్‌ పరగడుపున తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

Beetroot Juice Benefits: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన..

Beetroot Juice Benefits: బీట్‌రూట్‌ జ్యూస్‌ పరగడుపున తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2021 | 11:34 AM

Beetroot Juice Benefits: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. కొన్నింటిని పాటిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రతి రోజు వివిధ రకాల పండ్లను తీసుకోవడం వల్ల ఎంతో మేలంటున్నారు. ముఖ్యంగా పళ్ల రసాల ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చాలా మందికి బీట్‌రూట్‌ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దానిని పచ్చిగా తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ బీట్‌రూట్‌ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బీట్‌రూమ్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రక్తహీనతతో బాధపడేవారికి..

బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల రక్తం త్వరగా తయారయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు ఈ జ్యూస్‌ తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే రోజంతా హుషారుగా, ఉత్సాహంగా ఉండడమే కాకుండా ఎంతో శక్తి అందుతుంది. అలాగే బీట్‌రూట్‌ వల్ల చురుకుదనం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా చేయాలని ఉత్సాహంగా ఉండేందుకు ఈ జ్యూస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

హైబీపీ ఉన్నవారికి..

ఇక హైబీపీ ఉన్నవారికి బీట్‌రూట్‌ మంచి ఔషధంగా పని చేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీని అదుపులో ఉంచేందుకు పని చేస్తుంది. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక కొలెస్టాల్‌ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ జ్యూస్‌ తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్టాల్‌ కరిగిపోతుంది. అంతేకాదు జ్యూస్‌ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

గర్భిణులకు..

అలాగే ఈ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల గర్భిణులకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా అందుతుంది. దీంతో కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇలా జ్యూస్‌ తాగడం వల్ల మంచి ఉపయోగాలుంటాయని, క్రమం తప్పకుండా తాగినట్లయితే అనారోగ్య సమస్యలు దరి చేరవని సూచిస్తున్నారు.

లివర్‌ సమస్య ఉన్నవారికి..

ఇక లివర్‌ సమస్యలు ఉన్న వారు ప్రతి రోజు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం ఎంతో మంచిది. బీట్‌ రూట్‌ వల్ల లివర్‌ శుభ్రం అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. ఈ జ్యూస్‌ వల్ల లీవర్‌ పని తీరు మెరుగుపడుతుంది. దీంతో మనషి ఆరోగ్యంగా ఉండేందుకు మేలు చేస్తుంది.

జ్ఞాపక శక్తి పెరిగేందుకు..

నిత్యం బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐరన్‌ తక్కువగా ఉన్న వారు రక్తహీనతకు గురవుతారు. ఈ జ్యూస్‌ వల్ల ఐరన్‌ పెరుగుతుంది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది. ఎంతో మంది నీరసంతో ఇబ్బందులకు గురవుతారు. అలాంటి వారు కొన్ని బీట్‌రూట్‌ ముక్కలు తిన్నా .. లేదంటే జ్యూస్‌ తాగినా మంచి ఉపయోగం ఉంటుంది. నీరసం పోయి ఎనర్జీ వస్తుంది.

ఎముకలు గట్టిపడేందుకు..

బీట్‌రూట్‌లో శరీరానికి కావాల్సిన చాలా విటమిన్స్‌ ఉంటాయి. బీ,సీ విటమిన్స్‌ అందుతాయి. బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నిషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. ఎముకలను గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంటుంది.

ఇవీ కూడా చదవండి: Ear Examination: శిశువుకు ఈ పరీక్షలు తప్పనిసరి.. అత్యాధునిక పరికరాలతో ఈ సమస్య గుర్తింపు..!

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం

Weight Loss Tips: ఈ మూడు కీలక సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.. ఆరోగ్య నిపుణుల సూచనలు..!

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!