AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ear Examination: శిశువుకు ఈ పరీక్షలు తప్పనిసరి.. అత్యాధునిక పరికరాలతో ఈ సమస్య గుర్తింపు..!

Ear Examination: పుట్టే ప్రతి శిశువు ఆరోగ్యంతో పాటు అనారోగ్యంతో పుట్టవచ్చు. కానీ అనారోగ్యంతో పుడితేనే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పుట్టిన ప్రతి శిశువుకు..

Ear Examination: శిశువుకు ఈ పరీక్షలు తప్పనిసరి.. అత్యాధునిక పరికరాలతో ఈ సమస్య గుర్తింపు..!
Subhash Goud
|

Updated on: Sep 12, 2021 | 9:23 AM

Share

Ear Examination: పుట్టే ప్రతి శిశువు ఆరోగ్యంతో పాటు అనారోగ్యంతో పుట్టవచ్చు. కానీ అనారోగ్యంతో పుడితేనే ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పుట్టిన ప్రతి శిశువుకు వెంటనే అవయవాలు సరిగా ఉన్నాయా? లేదా? ఏమైనా సమస్యలున్నాయా అని పిల్లల వైద్య నిఫుణులు నిర్ధారణ చేస్తారు. అందులో ప్రధానమైనవి చెవి, కండ్లు, ముక్కు, గొంతు తదితరాలు. అందుకే శిశువులకు వినికిడి పరీక్షలు తప్పనిసరి అయ్యాయి. శిశువుకు ఈ పరీక్షలు చేయకపోతే భవిష్యత్తులో వినికిడి సమస్యలు తప్పదంటున్నారు వైద్య నిపుణులు. కొంత మంది శిశువులకు పుట్టుక నుంచే వినికిడి సమస్య ఉంటుంది. దీనిని శిశు ప్రాయంలోనే గుర్తిస్తే భవిష్యత్తుల్లో సమస్యను అధిగమించవచ్చంటున్నారు వైద్యులు. ప్రతి ప్రసూతి దవాఖానల్లో బిడ్డ జన్మించగానే శిశువులకు కంటి, చెవి తదితర ప్రధాన అవయవాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో ఒకటి డెఫీషియన్సీ (వినికిడి) పరీక్ష.

ముఖ్యంగా పుట్టే పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకుండా జన్మించడం, ఎన్‌ఐసీయూలో చికిత్స పొందిన శిశువులు, ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న తల్లులకు సంబంధించిన శిశువులకు ఈ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామంటున్నారు నిలోఫర్‌ వైద్యులు. ఇందుకోసం నిలోఫర్‌ దవాఖానలోని నియోనాటల్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక పరికరాలతో శిశువులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పుట్టిన ప్రతి శిశువుకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలతో పిల్లల్లో వినికిడికి సంబంధించిన ఏదైనా లోపం ఉంటే ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేసే వీలుంటుందన్నారు.

ముఖ్యంగా హై రిస్క్‌ ఉన్న పిల్లలకు ‘ఓటో ఎరోస్టిక్‌ ఎమిషన్‌ (ఓఏఈ), బెరా పరీక్షలను నిర్వహిస్తారు. ఓఏఈ పరీక్షలో ఫెయిల్‌ అయిన శిశువులకు అంటే వినికిడి లోపం ఉన్న శిశువులకు తదుపరి ‘బెరా’ పరీక్షలను నిర్వహిస్తారు. దీని ఆధారంగా పిల్లల్లో వినికిడి లోపానికి సంబంధించిన కారణాలను గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తారు.

ప్రతి ఆరు మాసాలకోసారి పరీక్షలు తప్పనిసరి..

సాధారణంగా శిశువుకు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వినికిడి పరీక్షలు చేయించాలని నిలోఫర్‌ వైద్యులు డాక్టర్‌ రమేశ్‌ బాబు సూచిస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో వినికిడి సమస్యతో పాటు కర్ణ భేరి తదితర సమస్యలు రాకుండా నివారించవచ్చని అంటున్నారు. పిల్లల్లో చెవి రంధ్రాల్లో డివైస్‌ (జీవిలి)పేరుకుపోతుంటుందని, అది గట్టిపడి వినికిడి సమస్యకు దారితీసే అవకాశముందని చెబుతున్నారు వైద్యులు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చన్నారు.

అత్యాధునిక పరికరాలతో సమస్య గుర్తింపు..

0-7 ఏండ్లలోపు పిల్లలు తమ సమస్యను సహజంగా చెప్పలేరు. వారికి చెవిలో ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవడం కష్టం. అందుకు ఆధునిక పరికరాలను వినియోగించి పిల్లల సమస్యను గుర్తిస్తారు. ఇయర్‌ క్యాల్‌క్యూలేటర్‌ అనే పరికరంతో శిశువు వినికిడి సామర్ధ్యాన్ని, ఇయర్‌ ప్యాడ్‌తో చెవి తదితర సమస్యలను గుర్తించవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం