Hyderabad: తన కంటే 12ఏళ్ల చిన్నోడితో మహిళ అఫైర్.. ఫైనల్‌గా ఊహించని విషాదాంతం

ప్రియురాలు మరికొందరితో సన్నిహితంగా ఉండటం అతడు తట్టుకోలేకపోయాడు. ఇంట్లో కూడా గొడవలు ఎక్కువవ్వడంతో ఆమెను చంపాలని డిసైడయ్యాడు.

Hyderabad: తన కంటే 12ఏళ్ల చిన్నోడితో మహిళ అఫైర్.. ఫైనల్‌గా ఊహించని విషాదాంతం
Man Kills Lover'
Follow us

|

Updated on: Sep 12, 2021 | 7:19 PM

హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పరిధిలో మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.  జవహర్‌నగర్‌ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..  48 ఏళ్ల మహిళ , భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి కాప్రా వంపూగూడలో నివాసం ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్‌లో ఓ హోటల్‌లో పనిచేసేది. అక్కడే వర్క్ చేస్తోన్న మారేడుపల్లికి చెందిన అశోక్‌(36)తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది. అశోక్‌ కాప్రా సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అయితే ప్రియురాలితో గడిపేందుకు సమీపంలోనే మరో సెపరేట్ రూమ్ రెంట్‌కు తీసుకున్నాడు. తనకంటే 12 చిన్నవాడైనప్పటికీ ఆ మహిళ అశోక్‌తో లైంగిక సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇటీవల అశోక్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో అశోక్ ప్రియురాలిని రెగ్యులర్‌గా కలవలేకపోతున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు ఇటీవల మరికొందరితోనూ సన్నిహితంగా ఉంటున్నట్లు అశోక్‌కు తెలిసింది. తనను మోసం చేసిన ఆమెను ఖతం చేయాలని డిసైడయ్యాడు.

ఈ నెల 5 తేదీన ఆమెను తన రూమ్‌కి రమ్మని చెప్పాడు. దీంతో ఆ మహిళ అక్కడికి వెళ్లింది. ఇంట్లో చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్తున్నానని మనవరాలికి చెప్పింది. వెళ్లిన మనిషి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. రాత్రయినా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అశోక్‌పై అనుమానం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. తమదైన స్టైల్లో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతోనే ప్రియురాలిని గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకొన్నాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు డెడ్‌బాడీని శామీర్‌పేట మండలం లాల్‌గడిమలక్‌పేట్‌ అటవీ ప్రాంతంలో వెలికితీసి ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. అశోక్‌పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జవహర్‌నగర్ పోలీసులు తెలిపారు.

Also Read: సంచలన ఘటన.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మామను చంపిన అల్లుడు

Anantapur District: ఈ చిత్రం చూశారా..! చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేశారట

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..