AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur District: ఈ చిత్రం చూశారా..! చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేశారట

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. చనిపోయిన వ్యక్తికి టీకా వేసినట్లు కోవిన్‌ యాప్‌లో నమోదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Anantapur District: ఈ చిత్రం చూశారా..! చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేశారట
Corona Vaccine
Ram Naramaneni
|

Updated on: Sep 12, 2021 | 12:34 PM

Share

చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేసినట్లు నమోదు చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. హిందూపురంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి జులైలో కాలం చేశారు. అయితే ఆయనకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ కంప్లీట్ అయినట్లు  ఆయన కుమారుడి ఫోన్‌కి సందేశం వచ్చింది. అదే ఫ్యామిలీలో మరో యువకుడు గతంలోనే సెకండ్ డోస్‌ టీకా వేయించుకున్నాడు. ఫస్ట్ డోస్‌ పూర్తి చేసుకున్నట్లు తాజాగా ఎస్‌.ఎం.ఎస్‌ వచ్చింది. ఇలా ఒకేరోజు తప్పుడు సందేశాలు రావడంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. కరోనా వ్యాక్సినేషన్ నమోదుపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ బాధ్యతను వైద్యఆరోగ్య సిబ్బందితోపాటు ఏఎన్‌ఎంలకు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు చూస్తున్నారు. కొంతమంది సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

గ్రామాల్లోని ఆధార్‌కార్డులు, ఫోన్‌నెంబర్లు సేకరించి వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు నమోదు చేస్తున్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో స్టోర్ చేస్తున్నారు. జిల్లాలో చాలామంది సెకండ్ డోస్ వేసుకోకుండానే వేసుకున్నట్లు సమాచారం వస్తోంది. దీనిపై వందల్లో కంప్లైంట్లు వస్తున్నా సాంకేతిక లోపం అని చెప్పి ఉన్నతాధికారులు ఎస్కేప్ అవుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వ్యాక్సిన్‌కు దూరమవుతున్నామని బాధితులు వాపోతున్నారు.

Also Read: సంచలన ఘటన.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మామను చంపిన అల్లుడు

 కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు గూడ్‌న్యూస్‌

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు