Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం

Sleep Aid Device: ప్రస్తుత రోజుల్లో నిద్రలేమితనంతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఆన్‌లైన్‌ చాటింగ్‌లు, బ్రౌజింగ్‌లు ఇలా మొబైల్‌ ఫోన్‌లను వినియోగిస్తుండటం..

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం

Sleep Aid Device: ప్రస్తుత రోజుల్లో నిద్రలేమితనంతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఆన్‌లైన్‌ చాటింగ్‌లు, బ్రౌజింగ్‌లు ఇలా మొబైల్‌ ఫోన్‌లను వినియోగిస్తుండటం కారణంగా నిద్ర అనేది కరువైపోతుంది. దీని కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రుల్లో ఫోన్లు వాడటం, మానసిక ఆందోళనలు తదితర కారణాలతో నిద్రలేమి సమస్య ఉండేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందుకు పరిష్కారంగా కొత్త టెక్నాలజీని కనుగొన్నారు.

మైక్రో–కరెంట్‌ స్మార్ట్‌ హిప్నాసిస్‌ ఇస్ట్రుమెంట్‌ అనే పరికరాన్ని హైటెక్నాలజీతో రూపొందించారు. ఈ పరికరం ప్రధానంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి ఎంతగానో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్‌డ్‌గా కళ్లు మూసుకుంటే చాలు.. మెదడులోని కండరాలను ఉత్తేజపరచి.. నిద్రపోయేలా చేస్తుంది. ఇది సురక్షితమైనది.. తేలికైనది.. పరిమాణంలో చిన్నది. పోర్టబుల్‌ మాత్రమే కాదు సులభంగా ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్‌ మోడ్స్‌ ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీకి డికంప్రెషన్‌ మోడ్, హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్‌ మోడ్‌ నొక్కాలి. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్‌ మైనస్‌ బటన్స్‌ కూడా ఉంటాయి.

ఈ స్లీప్‌ ఎయిడ్‌ పరికరాన్ని కార్యాలయాల్లో, ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సుమారు 15 నిమిషాలు వాడితే.. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుందట. దీనిని చేతికి బ్రేస్‌లెట్‌లా వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన బ్యాండ్‌ ఉంటుంది. ఆ పరికరాన్ని చేతికి పెట్టుకొని నిద్రపోతే తెల్లవారాక.. ఆ రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా మొదలవుతుంది. దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే సుమారు రూ. 2,200 ఉంటుంది.

కాగా, చాలా మంది వివిధ రోగాల బారిన పడేందుకు సరైన నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. మనిషికి సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడని, సమయానికి నిద్రపోవడం ఎంతో అవసరమంటున్నారు. సరైన నిద్ర ఉండకపోవడానికి గల కారణం మానిసిక ఒత్తిడి, ఇతర టెన్సన్స్‌ ఒక కారణమైతే.. రాత్రుల్లో మొబైల్‌ ఫోన్లు వాడటం కూడా మరో కారణమని చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Blood Pressure: మీకు అధిక రక్తపోటు ఉందా..? ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే అదుపులో ఉంటుంది

 

Click on your DTH Provider to Add TV9 Telugu