JioPhone Next Launch: రిలయన్స్ కస్టమర్లకు నిరాశ.. ‘జియో ఫోన్ నెక్స్ట్ విడుదల వాయిదా.. మరి ఎప్పుడంటే.!
Jio Phone Next Launch update: టెలికాం రంగంలో సంచనాలకు పేరున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. కస్టమర్లకు కొత్త కొత్త ఆఫర్లను అందించడంతో పాటు
Jio Phone Next Launch update: టెలికాం రంగంలో సంచనాలకు పేరున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. కస్టమర్లకు కొత్త కొత్త ఆఫర్లను అందించడంతో పాటు చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది జియో. ఇక జూన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ ఏజీఎంలో ముకేశ్ అంబానీ అతి చౌకైన స్మార్ట్ ఫోన్ అందిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గణేష్ చతుర్థి రోజున సెప్టెంబర్ 10న ఈ ఫోన్ విడుదల కాబోతోందని ప్రకటించగా, దీనిని వాయిదా వేసింది రిలయన్స్ జియో. దీపావళి పండగ సీజన్ నాటికి ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ శుక్రవారం వెల్లడించింది.
రిలయన్స్ – గూగుల్ భాగస్వామ్యంతో అత్యంత చౌకైన ‘జియో ఫోన్ నెక్స్ట్’ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ను సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. అయితే వినియోగదారుల మెప్పు పొందేలా ఈ ఫోన్‌ను మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు మరింత సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఫోన్‌లో మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చేందుకు కొంతమంది పరిమిత యూజర్లతో జియోఫోన్ నెక్స్ట్ టెస్టింగ్‌ను రిలయన్స్ జియో, గూగుల్ ప్రారంభించాయి. దీపావళి పండగ సీజన్ నాటికి ఈ ఫోన్‌ను మార్కెట్లో విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అప్పటికి పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సెమీకండక్టర్ల కొరత కూడా తీరుతుందని భావిస్తున్నాం’ అని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచంలో అతిచౌకైన ధరలో 4జీ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారి కోసం జియోఫోన్ నెక్స్ట్‌ను రూపొందించినట్లు రిలయన్స్ జియో గతంలో వెల్లడించింది. జియో కోసం గూగుల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో.. వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ రూ.3,499 ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూసిన కస్టమర్లకు నిరాశ ఎదురైంది.
Also Read: