Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు డెంగ్యూ దడ.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఆరోగ్య శాఖ ఆగ్రహం

ఇటు కరోనా తగ్గుముఖం పట్టిందో లేదో.. అటు డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఏకంగా 613 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణకు డెంగ్యూ దడ.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఆరోగ్య శాఖ ఆగ్రహం
Dengue
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:46 PM

Hyderabad Dengue Cases: ఇటు కరోనా తగ్గుముఖం పట్టిందో లేదో.. అటు డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణకు డెంగ్యూ దడ పుట్టిస్తోంది. రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కొవిడ్, సీజనల్ వ్యాధులుపై సీఎం కేసీఆర్‌ సమీక్షించినట్లు డైరెక్టర్ శ్రీనివాస్‌ తెలిపారు. కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2019లో రాష్ట్రంలో 4 వేల డెంగ్యూ కేసులు రిపోర్ట్ కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు శ్రీనివాస్ చెప్పారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లడ్‌లో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిందని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తూ.. జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగ్యూకి సంబంధించి నగర ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు 104కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అక్టోబర్ నెలాఖరు వరకు వైరల్‌ జ్వరాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు.

అటు  కొత్త వేరియంట్ వస్తే తప్ప తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు.. అలా అని ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దు.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలో 0.4 శాతం పాజిటివిటీ రేట్ ఉందని.. కొవిడ్ పూర్తి నియంత్రణలో ఉందన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభం అయినందున కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయనుకున్నాం.. కానీ ఎక్కడా క్లస్టర్ బ్రేక్ చోటుచేసుకోలేదన్నారు హెల్త్ శాఖ డైరెక్టర్. తల్లిదండ్రులు వారి పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపవచ్చని సూచించారు. ఇప్పటివరకూ లక్షా 15 వేల మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 55 మందికి వైరస్‌ సోకినట్లు తేలిందన్నారు.

భవిష్యత్‌లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేలా సిద్ధంగా ఉన్నామన్నారు. 40 శాతం ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ ప్లాంట్స్‌తో సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Also Read..

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ తాజా హెల్త్‌ బులిటెన్‌ వచ్చేసింది.. వైద్యులు ఏమన్నారంటే.

మీ రేషన్ కార్డులో మొబైల్ ఫోన్ నంబర్‌ను మార్చడం చాలా సులభం… పూర్తి ప్రక్రియ తెలుసుకోండి..