Weight Loss With Fennel Seeds: బరువు తగ్గాలంటే సోంపు వాటర్ తాగాల్సిందే..! వెయిట్ లాస్‌కు బెస్ట్ ఆఫ్షన్
Fennel Water: ఫెన్నెల్ సీడ్స్ దాదాపు ప్రతీ ఇంటిలో ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ, వాటితో శరీర బరువును తగ్గించవచ్చని మీకు తెలుసా? ఆ వివరాలు తెలుసుకుందాం.
Fennel Water Health Benefits: బరువు తగ్గించేందుకు చాలామంది ఎంతో కష్టపడుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంత సులభం కాదు. ఏది తిన్నా, తాగినా అది శరీర బరువును తగ్గించే విధానంపై పడుతుంది. అందుకే ప్రతీ దానిని లెక్క ప్రకారం తీసుకుంటుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామానికి ప్రత్యామ్నాయం లేకపోతే మీ బరువు విపరీతంగా పెరిగిపోతుంది. అయితే, ఫెన్నెల్ సీడ్స్ కూడా మన శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్రం పోషిస్తుందని మీకు తెలుసా? సోంపుతో బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపును సాధారణంగా భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్, జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు తీసుకుంటాం. అయితే దీనిని రోజులో ఏ సమయంలోనైనా తిసుకోవచ్చు. ఇది ఆస్తమా, ఉదర సంబంధం ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
1. సోంపు బరువు తగ్గడానికి సహాయపడతుందా? సోంపు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియ, జీవక్రియలో సహాయపడతాయి. ఆహారం నుంచి పోషకాలను శోషించడాన్ని పెంచుతాయి. అందువల్ల ఆకలిని తగ్గిస్తుంది.
ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన వస్తుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం మానుకుంటారు. బరువు తగ్గాలని మీరు అనుకుంటే కచ్చితంగా ఫెన్నెల్ సీడ్స్ మీకు సహాయపడతాయి.
2. బరువు తగ్గడానికి ఫెన్నెల్ సీడ్స్ ఉత్తమం ఒక టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని పరగడుపున ఉదయం తాగండి. అలాగే సోంపు టీని కూడా తీసుకోవచ్చు.
3. జీవక్రియను పెంచుతుంది జీవక్రియను పెంచి, కణాలు శక్తిని ఉపయోగించే రేటును పెంచేలా చేస్తుంది. సోంపు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తీసుకుంటే చాలా మంచింది.
4. ఆకలిని తగ్గిస్తుంది సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. ఎక్కువగా తినకుండా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో శరీర బరువు కచ్చితంగా తగ్గుతుంది.
5. నాచురల్ డిటాక్సిఫైయర్ ఫెన్నెల్ ఒక సహజ డిటాక్సిఫైయర్. అందువల్ల భోజనం చేసిన వెంటనే దీనిని తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరం నుంచి అనేక టాక్సిన్‌లను తొలగిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా జరిగేలా చూస్తోంది.
6. పోషకాలు పుష్కలంగా సోంపులో జింక్, భాస్వరం, సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది ఊబకాయంతోపాటు ఇతర వ్యాధులకు దారితీస్తుంది.
7. జీర్ణక్రియకు సహాయపడుతుంది ఎస్ట్రాగోల్, ఫెంచాన్, అనెథోల్ వంటివి సోంపులో ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ రసాన్ని ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియలో సహాయపడతాయి. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడంతో సహాయపడుతుంది. బరువు తగ్గాలంటే జీర్ణక్రియ చాలా కీలకంగా మారుతుంది.
8. అదనపు నీటిని తొలగించడంలో.. ఫెన్నెల్ టీ లేదా నీరు తాగడం వలన శరీరంలో ఉండే అదనపు నీటిని తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో ఉన్న అదనపు నీటిని శరీరంలో నిల్వ లేకుండా చేయడంలో సహాయపడుతుంది.
Also Read: Weight Loss Tips: ఈ మూడు కీలక సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.. ఆరోగ్య నిపుణుల సూచనలు..!