Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakebite:ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేస్తే ప్రాణాలు రక్షించవచ్చు.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన హోమియోపతి మందు ఏమిటో తెలుసా

Snakebite First Aid: అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ పాములను భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. ప్రపంచంలో విస్తరించి ఉన్న పాముల్లో చాలా వరకు..

Snakebite:ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేస్తే ప్రాణాలు రక్షించవచ్చు.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన హోమియోపతి మందు ఏమిటో తెలుసా
Snake Bite
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2021 | 9:43 AM

Snakebite First Aid: అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ పాములను భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. ప్రపంచంలో విస్తరించి ఉన్న పాముల్లో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా. ఇక మన దేశంలో దాదాపు 250 జాతుల పాములుండగా.. వాటిల్లో 52 విష సర్పాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కల్గి ఉన్నాయని తెలుస్తుంది. ఇవి మనిషిని కాటు వేస్తే 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఐతే పాము కరిచిన వెంటనే తగిన విధంగా ప్రథమ చికిత్స చేసి.. మూడు గంటల వ్యవధిలోనే తగిన వైద్యం అందిస్తే.. పాము కరిచిన వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. అందుకనే ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి.. లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మరణిస్తాడు.

అయితే పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం. పాముల్లో చాలా రకాలున్నాయి. పాము లెన్ని రకాలుగా ఉన్నా ప్రధానంగా రెండే జాతులుగా వాటిని విభజించాలి. విషం ఉన్న పాములు, విషం లేని పాములు. నిజానికి విష సర్పాలకన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం మంచిది. విష సర్పం కరిచినా రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొంతమంది విషం లేని పాము కరిచినా కంగారుతో, భయంతో ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు.

పాము మనకు శత్రువు కాదు. తన ఆత్మ రక్షణ కోసం, విధి లేని పరిస్ధితుల్లో మాత్రమే కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఒక వేళ పాము కరిస్తే తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం తప్పని సరి. ఒకవేళ పాము కరిస్తే.. అది విషపు పామా.. లేక సాధారణ పామా తెలుసుకోవాలి.. దీనికి సులభమైన పద్దతి.. పాము కట్లను గుర్తుపట్టడం.. ముందుగా పాము కరిచిన చోట ఎన్ని గాట్లు ఉన్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని.. మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.

విషపు పాము కాటు వేస్తె… ఆ విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది ఆలోపు చికిత్స మనిషికి అందించకుంటే.. ఇక ఆ మనిషి బతికే అవకాశాలు దాదాపు లేనట్లే.. అందుకనే విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని సిరంజ్ లోకి లాగాలి.. ఇలా చేస్తున్నప్పుడు మొదట వచ్చే రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేసిన అనంతరం మనిషి సృహలోకి వస్తాడు. నిజానికి పాము కోరల్లో నిల్వ ఉండే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే

ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలు మాత్రమే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లి తగిన చికిత్సనందించాలి.

Also Read: Kanipakam: కరోనా నిబంధనల నడుమ కాణిపాకంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు.. నేడు చిన్న, పెద్ద వాహన సేవలు..