Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌.. డబ్బులు లేకపోయినా.. రూ.70 వేల వరకు షాపింగ్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!

Flipkart: దసరా, దీపావళి పండగ సీజన్‌ వచ్చేసింది. చాలా మంది స్మార్ట్‌టీవీలు, ఫ్రిజ్, ఇతర వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారు. అలాగే ప్రస్తుతం రకరకాల..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌.. డబ్బులు లేకపోయినా.. రూ.70 వేల వరకు షాపింగ్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!
Flipkart
Follow us

|

Updated on: Sep 16, 2021 | 1:04 PM

Flipkart: దసరా, దీపావళి పండగ సీజన్‌ వచ్చేసింది. చాలా మంది స్మార్ట్‌టీవీలు, ఫ్రిజ్, ఇతర వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారు. అలాగే ప్రస్తుతం రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రావడంతో ఫోన్‌లను కొనాలనుకుంటారు. ఇలా షాపింగ్‌ చేసేవారికి మంచి అవకాశం అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ (Flipkart Pay Later) ఆఫర్‌లో భాగంగా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.70వేల వరకు షాపింగ్‌ చేసే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్‌ కార్ట్‌. ఆ మొత్తాన్ని షాపింగ్‌ కోసం వాడుకుని వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఉంటుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆఫర్ కొత్తదేమీ కాదు. గతంలో ఉన్నదే. కానీ గతంలో క్రెడిట్ లిమిట్ కేవలం రూ.3000, రూ.10,000 మాత్రమే ఉండేది. అంటే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు పే లేటర్ ఆప్షన్ ద్వారా గరిష్టంగా రూ.10వేలు మాత్రమే క్రెడిట్ పొందే అవకాశం ఉండేది.

త్వరలో దసరా సేల్, దీపావళి సేల్ జరగనున్నాయి. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలోనే ఈ సేల్ ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అంతకన్నా ముందే ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ ఆఫర్‌లో క్రెడిట్ లిమిట్‌ను భారీగా పెంచింది.

క్రెడిట్ లిమిట్‌ను ఏకంగా రూ.10,000 నుంచి రూ.70,000 చేసింది. ఈ మొత్తంతో కస్టమర్లు స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్, రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయవచ్చు. మీరు కనుక ఈ ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా షాపింగ్‌ చేస్తున్నట్లు ఓ సారి చెక్‌ చేసుకోండి డబ్బులు క్రెడిట్‌ అయ్యాయా లేదా అని. రెగ్యూలర్‌గా ఈ ఆప్షన్‌ ద్వారా షాపింగ్‌ చేస్తే మీరు ప్రతి నెల ఎంత మొత్తంలో షాపింగ్‌ చేస్తున్నారో దానిని బట్టి మీకు రూ.10వేల నుంచి రూ.70 వేల వరకు క్రెడిట్‌ అయ్యే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లోని 10 కోట్ల మందికి పైగా కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లభిస్తోంది. వారంతా పే లేటర్ ఆప్షన్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువు కొనుగోలు చేయవచ్చు. పే లేటర్ ఆప్షన్ ద్వారా క్రెడిట్ లిమిట్ పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించాలి. ఆ తర్వాతే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ ఆప్షన్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు నచ్చిన ప్రొడక్ట్ కార్ట్‌లో యాడ్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ సెక్షన్‌లో ఈఎంఐ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఎంత ఈఎంఐ చెల్లించాలో అక్కడ వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రతీ నెలా ఈఎంఐ మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.

ఇవీ కూడా చదవండి: SBI Car Loan: కారు కొనేవారికి ఎస్‌బీఐ తీపికబురు.. పండగ సీజన్‌లో బంపర్‌ ఆఫర్‌..!

EPF Account: మీకు ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉందా..? ఈ ఫామ్‌ నింపితే రూ. 7 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..!