- Telugu News Photo Gallery Business photos State bank of india yono car loan priority delivery interest rate discount
SBI Car Loan: కారు కొనేవారికి ఎస్‌బీఐ తీపికబురు.. పండగ సీజన్‌లో బంపర్ ఆఫర్..!
SBI Car Loan: బ్యాంకులు తన కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులకు మరింత మేలు చేకూర్చే విధంగా రుణాలు అందిస్తున్నాయి..
Updated on: Sep 16, 2021 | 11:47 AM

SBI Car Loan: బ్యాంకులు తన కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులకు మరింత మేలు చేకూర్చే విధంగా రుణాలు అందిస్తున్నాయి. ఇక కారు కొనుగోలు విషయాలలో కూడా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నాయి.

పండగ సీజన్ వచ్చేసింది. మీరు కొత్త కారు కొనాలని భావిస్తే మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కారు కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. అదిరే ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్తగా కారు కొనేవారికి ఎస్‌బీఐ సులభంగానే రుణాలు అందిస్తోంది. క్షణాల్లో రుణం పొందే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా వడ్డీ రేట్లపై తగ్గింపు కూడా పొందవచ్చు. 0.25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్రియారిటీ డెలివరీ సదుపాయం కూడా ఉంది. అయితే ఎస్‌బీఐ యోనో ద్వారా కారు కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

అంతేకాకుండా కియా కార్ల కొనుగోలుకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కారు బుక్ చేసుకోవాలని భావించే వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్‌లోకి వెళ్లి షాప్ అండ్ ఆర్డర్స్ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ ఆటోమొబైల్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కియా కారు ఆఫర్ అందుబాటులో ఉంటుంది.





























