- Telugu News Photo Gallery Business photos UPI Payment: India and Singapore sign pact for instant flow of retail payments
UPI Payment: ఆర్బీఐ మరో కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్ సర్వీసులు.. !
UPI Payment: ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించిన రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు..
Updated on: Sep 15, 2021 | 1:57 PM

UPI Payment: ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించిన రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకుంటోంది.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. ఆరంభంలో అడుగులు నెమ్మది నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణ విషయంగా మారింది. టీ కొట్టు, పాన్ డబ్బా దగ్గర నుంచి కూరగాయాలు, ఇతర షాప్‌లలో కూడా యూపీఐ పేమెంట్స్ కొనసాగుతున్నాయి.

ఇక విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు అవగాహనకు రావాలని నిర్ణయించింది.

ముందుగా భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలగనుంది.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ విధమైన ఒప్పందంతో భారత్-సింగపూర్ దేశాల మధ్య చెల్లింపులు సులభతరం కానుంది.




