AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Bamboo Day 2021: ‘వెదురు’కు ఎదురు లేదు.. విస్తీర్ణంలో భారత్‌ రెండో స్థానం..ఈ సాగుతో లక్షలు సంపాదించవచ్చు

World Bamboo Day 2021: ప్రకృతి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది..

World Bamboo Day 2021: 'వెదురు'కు ఎదురు లేదు.. విస్తీర్ణంలో భారత్‌ రెండో స్థానం..ఈ సాగుతో లక్షలు సంపాదించవచ్చు
World Bamboo Day 2021
Subhash Goud
|

Updated on: Sep 18, 2021 | 1:15 PM

Share

World Bamboo Day 2021: ప్రకృతి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వెదురు వ్యాపారం చేసే వారికి కోట్లాది రూపాయలు వచ్చేలా చేస్తుంది. అందుకే వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి, వెదురు పెంపకంపై అవగాహన కల్పించే దిశగా ఒక రోజును కేటాయించారు. అదే సెప్టెంబర్‌ 18న ప్రపంచ వెదురు దినోత్సవం. ఈ ప్రత్యేక రోజున వెదురు గురించి తెలుసుకుందాం.

ప్రపంచ వెదురు.. అంటే పెంపక-పరిరక్షణ నిర్వాహణ సంస్థ ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2009లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్‌ బాంబూ కాంగ్రెస్‌లో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించారు. వెదురు పెంపకం, సంప్రదాయ పద్ధతుల్లో వాడకం గురించి, వెదురు వాడకం పెంపొందించేలా చర్యల గురించి, అన్నింటికి మించి అర్థిక పురోగతికి వెదురు ఉత్పత్తులను ఎలా నిర్వహించుకోవాలో అనే విషయాలపై ఈ రోజు ప్రధానంగా చర్చిస్తారు. అటవీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు వెదురు అనే చెప్పాలి. గిరిజనుల జీవనంలో ఇదొక భాగం కూడా. గిరిజనులకు జీవనోపాధికి వెదురు వ్యాపారం ఎంతగానో ఉపయోగపడుతుంది.గానే కాకుండా.. వాళ్ల సంప్రదాయాల్లోనూ పవిత్రతను సంతరించుకుంది వెదురు. చైనా, భారత్‌ లాంటి ఆసియా దేశాల్లో అభివృద్ధి చెందేందుకు వెదురు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 65 శాతం సాగుదల ఆసియా ఖండాల్లోనే సాగుతోంది. ఆ తర్వాత స్థానంఅమెరికా, ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి.

చైనా ఈ విషయంలో 70 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వెదురు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌ ఉంది. వియత్నం, థాయ్‌లాండ​, కాంబోడియాలు మార్కెట్‌ షేర్‌ మనకంటే ఎక్కువే. మన దగ్గర వెదురు విస్తీర్ణంగా పెరుగుతుంది.

వెదురులో 115 జాతులు..

కాగా, పోవాషియే కుటుంబానికి చెందిన వెదురులో 115 జాతులు, 1,400 ఉపజాతుల మొక్కలు ఉన్నాయి. కొన్ని జాతులు రోజుకి 30 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతాయి. ఈశాన్య ప్రపంచంలో వెదురును పేదవాడి కలపగా చెప్పుకుంటారు. అంతేకాదు ఆకుపచ్చ బంగారంగా వెదురుకు పేరుంది. ఈ వెదరు కలప కట్టడాలు, నిర్మాణ మెటీరియాల్‌గా, పేపర్‌, హస్తకళల్లోనూ, అనేక వాటికి వెదురును ఉపయోగిస్తారు

వెదురు పెంపకానికి..

వెదురు చెట్లను పెంపకానికి రసాయనాలు, పెస్టిసైడ్స్‌, ఫర్టిలైజర్స్‌ ఏవీ కూడా అవసరం ఉండదు. వేస్ట్‌ ల్యాండ్‌లో సైతం పెరిగి.. పర్యావరణాన్ని కాపాడుతుంది వెదురు. అంతేకాదు అధిక వర్షలప్పుడు మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుని అడవుల క్షీణతను అడ్డుకుంటుంది వెదురు. వెదురు ఆకులు పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి. దీనిని సిలికాను మందుల తయారీలో ఉపయోగిస్తారు. వెదురు సామాన్లకు, ఫర్నీచర్‌కు, పరికరాలకు, షోకేజ్‌ వస్తువులకు గ్లోబల్‌ మార్కెట్‌లో బాగా గిరాకీ ఉంది.

అయితే బాగా డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అయితే కొన్నింటిలో మంచి రాబడి వస్తుంది. కొన్నింటిలో తక్కువ రాబడి వస్తుంటుంది. మనం ఎంచుకునే వ్యాపారాన్ని బట్టి రాబడి పొందవచ్చు. డబ్బులు సంపాదించేందుకు రకరకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆధారం పొందవచ్చు. ఇందులో భాగంగా డబ్బులు సంపాదించే వారికి ఓ మంచి అవకాశం ఉంది. ఇదే బ్యాంబో చెట్ల పెంపకం. దీని ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు. రైతులు లక్షాధికారులు కావాలంటే ఈ చెట్లను పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి సబ్సిడీ కూడా అందిస్తోంది. ఒక్కో చెట్టుకు రూ.120 సబ్సిడీ అందిస్తోంది.

దేశంలో అధిక డిమాండ్:

దేశంలో ఈ వెదురు చెట్లకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. అందువల్ల మీరు ఈ చెట్లను పెంచితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ చెట్లను నాటితే 4 సంవత్సరాల తర్వాత నుంచి లాభాలు పొందవచ్చు. అలాగే ప్రతిసారి ఈ చెట్లను నాటాల్సిన పని ఉండదు. ఒక్కసారి నాటితే 40 ఏళ్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాంబో చెట్లలో 136 రకాలు ఉంటాయి. అందువల్ల మీరు మంచి రకాన్ని ఎంచుకుని పెంచితే మంచి ఆదాయం పొందవచ్చు. ఒక హెక్టార్‌లో 1500 మొక్కలను నాటవచ్చు. ఒక్కో మొక్కు ఐదు అడుగుల దూరం ఉండాలి. నాలుగేళ్ల తర్వాత నుంచి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పొందవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి బిజినెస్‌ చేసేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అధిక రాబడి వచ్చే బిజినెస్‌లను చేసే వారి కోసం ప్రభుత్వాలు కూడా రుణాలు, సబ్సిడీ వంటివి అందిస్తున్నాయి. అందుకే కొత్త కొత్త బిజినెస్ లను ఎంచుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి: Pan Card And Aadhaar Link: అదిరిపోయే శుభవార్త.. పాన్‌- ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు..!

Cooking Oil Price: కేంద్రం నిర్ణయంతో దిగి వచ్చిన వంట నూనె ధరలు.. హోల్‌సేల్‌ మార్కెట్లో ధరల వివరాలు..