Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్‌ను ఖతం చేసింది ఎవరు.. న్యూజిలాండ్ దేశమా.. ఉగ్రవాదమా?

PAK vs NZ: పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేస్తూ, "న్యూజిలాండ్ బోర్డు పాకిస్థాన్ క్రికెట్‌ను చంపేసింది" అంటూ విమర్శలు గుప్పించారు. మరి సిరీస్‌ను నిలిపివేసినందుకు కివీస్‌ను పాక్ తప్పుపట్టగలదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Pakistan Cricket: పాకిస్తాన్ క్రికెట్‌ను ఖతం చేసింది ఎవరు.. న్యూజిలాండ్ దేశమా.. ఉగ్రవాదమా?
Pakistan Cricket Board
Follow us

|

Updated on: Sep 18, 2021 | 3:14 PM

Pakistan Cricket: ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ షావై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తజికిస్థాన్‌ వెళ్లాడు. ఇలాంటి సమయంలోనే న్యూజిలాండ్ క్రికెట్ టీం పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. టాస్‌కు కొన్ని నిమిషాల ముందు, న్యూజిలాండ్ జట్టుకు ముప్పు ఉందని పేర్కొంటూ సిరీస్‌ను రద్దు చేసుకున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇలాంటి నిర్ణయం వెలువడిన వెంటనే పాకిస్తాన్ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్‌తో మాట్లాడారు. ఆమెకు హామీ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆటగాళ్ల భద్రతకు హామీ ఇచ్చారు. కానీ, కివీస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. పాకిస్తాన్ సైన్యం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రక్షణ కోసం అండగా నిలబడింది. అలాగే పాక్ సైన్యంలోనే ఉత్తమమైన ఎస్ఎస్‌జీ కమాండోలను కూడా నియమించింది. 4,000 మంది పాకిస్తాన్ సైన్యంతోపాటు పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షించేందుకు సిద్ధమైంది. కానీ, న్యూజిలాండ్ మాత్రం ఇలాంటి ప్రతిపాదనలకు ఒప్పుకోకపోవడం గమనార్హం.

ఉగ్రవాదాన్ని ఓ సాధనంగా వాడుతోన్న పాక్..! మాజీ సైనిక నియంత జనరల్ జియా-ఉల్-హక్ కాలం నుంచి పాకిస్తాన్ సైన్యం సమూలంగా మారింది. లెఫ్టినెంట్ జనరల్ షాహిద్ అజీజ్, పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, 3-స్టార్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, కమాండర్ లాహోర్ ఆధారిత 4 కార్ప్స్, ఇస్లామిక్ స్టేట్‌లో చేరారు. ఆఫ్ఘనిస్తాన్, సిరియాలో ఐఎస్ఐఎస్, అల్ ఖైదాతో కలిసి పోరాడుతున్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ మాజీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ హమీద్ గుల్ భారతదేశానికి వ్యతిరేకంగా తాలిబాన్, తీవ్రవాద సంస్థలను స్పాన్సర్ చేయడంతో అపఖ్యాతి పాలైన సంగతి తెలిసిందే.

మరోవైపు పూర్వ సోవియట్ యూనియన్‌ను ఓడించేందుకు పాకిస్తాన్ దేశం యూఎస్ డబ్బును వాడిందంటూ, అలాగే అఫ్గనిస్తాన్‌లోనూ యూఎస్‌ను ఓడించేందుకు యూఎస్ డబ్బును వాడిందంటూ బెన్‌గుల్ ఓ ప్రకటన చేశాడు. జెన్ గుల్ పాకిస్తాన్ సైన్యంలో అత్యంత కీలకమైన జనరల్‌లలో ఒకరు. జెన్ గుల్ ప్రగల్భానికి అంతా నవ్వుకున్నారు. కానీ, జీఎహెచ్‌క్యూ రావల్పిండిలో పనిచేస్తున్న బ్రిగేడియర్ అలీ ఖాన్ 2012 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉల్-తహ్రీర్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని తేలినప్పుడు పాకిస్తాన్ మౌనం పాటించింది.

పాకిస్తాన్ మాజీ సైనిక నియంత, చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ను జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమార్చే ప్రయత్నం చేశారు. దీంతో 2011 లో పీఎన్ఎస్ మెహ్రాన్ పై దాడి, 2 P3C ఓరియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ధ్వంసం చేసి, 15 మంది పాకిస్తాన్ భద్రతా దళాల సిబ్బందిని చంపడానికి దారితీసింది. పాకిస్తాన్ సాయుధ దళాలలో ఉగ్రవాద సంస్థల సహాయంతోనే ఇలా జరిగిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్ క్రికెట్‌ను ఖతం చేసిన కివీస్ టాస్‌కి ముందు న్యూజిలాండ్ సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్‌కు తీవ్రమైన నష్టం జరిగిందని పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. “న్యూజిలాండ్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్‌ను ఖతం చేసింది” అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ట్వీట్ చేశాడు. అయితే సిరీస్‌ను రద్దు చేసుకోవడంలో న్యూజిలాండ్ బోర్డును తప్పుపట్టగలదా? అంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

లాహోర్ నడిబొడ్డులో శ్రీలంక ఆటగాళ్లపై దాడి.. మార్చి 2009 లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియం మధ్యలో పాకిస్తాన్ వైమానిక దళం Mi 17 హెలికాప్టర్ ల్యాండింగ్ చేసిన ఫొటోలు ఇప్పటికీ క్రికెట్ ఆడే దేశాలకు బాగానే గుర్తున్నాయి. ఉగ్రవాదులు శ్రీలంక క్రికెట్ జట్టును లక్ష్యంగా చేసుకున్నారు. కెప్టెన్ మహేల జయవర్ధనే, వైస్ కెప్టెన్ కుమార సంగక్కరతో సహా ఐదుగురు ఆటగాళ్లను గాయపరిచారు. లాహోర్ నడిబొడ్డున జరిగిన ఉగ్రవాద దాడిలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఇద్దరు పౌరులు కూడా మరణించారు. గ్లోబల్ టెర్రరిస్ట్, 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ మొహమ్మద్ సయీద్.. గడాఫీ స్టేడియంలో ఈద్ నమాజ్‌కు నాయకత్వం వహించాడని తెలిసిందే.

హఫీజ్ సయీద్ వంటి గ్లోబల్ టెర్రరిస్టులు పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ అంతటా విస్తృతంగా ఎదిగారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తన గడ్డపై ఉన్న గ్లోబల్ టెర్రరిస్టులపై చర్య తీసుకోవడానికి నిరాకరించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కివీస్ పీఎం జసిండా ఆర్డెర్న్ తమ క్రికెటర్లను ఎందుకు రిస్క్‌లో పడేయాలని కోరుకుంటుందంటూ షోషబ్ అక్తర్‌ను ప్రశ్నిస్తున్నారు.

అత్యంత ప్రమాదకరమైన దేశం..? అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి జనరల్ జిమ్ మాటిస్ పాకిస్తాన్‌ను ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం అని పిలిచారు. అక్కడి నాయకులు ప్రజల భవిష్యత్తు పట్టించుకోరు. ప్రస్తుత పీఎం ఇమ్రాన్ ఖాన్ గతంలో తాలిబాన్ ఫైటర్‌లతో ఫోటోలు దిగడమే కాకుండా వారి కారణాలను సమర్థించడం ద్వారా గొప్పగా ఫీలయ్యేవాడు. దీని ఫలితంగా ఇమ్రాన్ ఖాన్ అపఖ్యాతి పాలయ్యాడనే విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ టీం ఏం చేయనుంది..? ప్రస్తుతం న్యూజిలాండ్ పాక పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్ టీం పాక్‌లో పర్యటించాల్సి ఉంది. దీంతో ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపడంపై 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. గత రెండు దశాబ్దాలలో చాలా టీంలు పాకిస్తాన్ పర్యటన నుంచి తప్పుకున్నాయి. 2002 లో కరాచీలోని పెర్ల్ కాంటినెంటల్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి జరిగింది. అప్పుడు న్యూజిలాండ్ టీం పాక్ పర్యటనలోనే ఉంది. అప్పటి నుంచి పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ఆనాటి ఉగ్రవాదుల దాడిలో 10 మంది ఫ్రెంచ్ నావల్ ఇంజనీర్లు, టెక్నీషియన్లు మరణించారు. అప్పుడు న్యూజిలాండ్ టీం హోటల్‌లో ఉంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య 2 వ టెస్ట్ మ్యాచ్ రద్దు చేశారు. ఆ తరువాత కివీస్ స్వదేశానికి తిరిగి వెళ్లింది.

2009 లో శ్రీలంక ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని లాహోర్‌లో దాడి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా 2010 అక్టోబర్-నవంబర్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్ పర్యటనను రద్దు అయింది. 2012 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ కూడా ఇలాంటి కారణాలతోనే తప్పుకుంది. 2016 లో వెస్టిండీస్‌ టీంను పాకిస్థాన్‌లో ఆడమంటూ పీసీబీ బ్రతిమాలింది. దీంతో 2 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేలతో సిరీస్ నిర్ణయించారు. కానీ, భద్రతా కారణాలతో ఈ సిరీస్‌ కూడా రద్దు అయింది. 2019 లో పాకిస్థాన్‌లో 2 వన్డేలు ఆడాలన్న పీసీబీ అభ్యర్థనను ఆస్ట్రేలియా తిరస్కరించింది.

పాకిస్తాన్‌తో సిరీస్‌ను న్యూజిలాండ్ రద్దు చేయడం ఆదేశ క్రికెట్‌కు తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది. ఉగ్రవాదాన్ని పాక్ ఒక సాధనంగా ఉపయోగించుకున్నందుకు గట్టి దెబ్బే తగిలిందని పలువురు అంటున్నారు. ఇక ముందుకూడా పాక్ పర్యటనకు వెళ్లేందుకు ఇతర దేశాలు ఒప్పుకోకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తిరిగి రావడాన్ని పాకిస్తాన్ సైన్యం సంబురాలు చేసుకోవడం కూడా చాలా దేశాలకు మింగుడుపడడంలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుంది. భవిషత్తులో కూడా ఇది మరింత ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా దేశాలు పాక్ వెళ్లేందుకు అభ్యంతరాలు చెప్పడంతో.. యూఏఈని తమ వేదికగా మార్చుకుని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతూ వచ్చింది. తాజాగా పాక్‌లో సిరీస్‌ ఆడేందుకు వచ్చిన కివీస్ కూడా ఇదే కారణంతో వైదొలగడంతో పాకిస్తాన్ క్రికెట్‌కు పెద్ద దెబ్బేనంటూ నిపుణులు అంటున్నారు.

Also Read: New Zealand Vs Pakistan: పాక్ క్రికెట్‌ను చంపేశారు.. హామీ ఇచ్చి సిరీస్‌ను అర్థాంతరంగా రద్దు చేస్తారా.. కివీస్‌ బోర్డుపై పాక్ మాజీల విమర్శలు

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో 19 హ్యాట్రిక్‌లు.. లిస్టులో ఈ ముగ్గురు భారత బౌలర్లను చూస్తే ఆశ్చర్యపోతారంతే..!

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!