New Zealand Vs Pakistan: పాక్ క్రికెట్‌ను చంపేశారు.. హామీ ఇచ్చి సిరీస్‌ను అర్థాంతరంగా రద్దు చేస్తారా.. కివీస్‌ బోర్డుపై పాక్ మాజీల విమర్శలు

Venkata Chari

Venkata Chari |

Updated on: Sep 18, 2021 | 1:38 PM

NZ vs PAK: పాకిస్తాన్‌లో సరైన భద్రత లేదంటూ కివీస్ టీం చివరి నిమిషంలో సిరీస్‌ను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ అభిమానులను షాక్‌కు గురిచేసింది.

New Zealand Vs Pakistan: పాక్ క్రికెట్‌ను చంపేశారు.. హామీ ఇచ్చి సిరీస్‌ను అర్థాంతరంగా రద్దు చేస్తారా.. కివీస్‌ బోర్డుపై పాక్ మాజీల విమర్శలు
Pak Vs Nz

Follow us on

New Zealand Killed Pakistan Cricket: పాకిస్తాన్‌లో సరైన భద్రత లేదంటూ కివీస్ టీం చివరి నిమిషంలో సిరీస్‌ను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ ఊహించని పరిణామానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అయోమయంలో పడింది. ఎన్నో ఏళ్ల తరువాత ఓ విదేశీ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టిందన్న ఆనందం కూడా పీసీబీకి మిగల్లేదు. అర్థాంతరంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో అసలు కారణం ఏంటో చెప్పాలని పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. ఏవైన లోపాలుంటే సరిదిద్దుకుంటామని, భద్రత ఏర్పాట్లను మరోమారు సమీక్షిస్తామని పేర్కొంది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పాకిస్తాన్ మాజీలు వాపోతున్నారు. అయితే కివీస్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్ భద్రతాధికారుల ఆదేశాల మేరకు క్రికెటర్లు హోటల్ రూముల నుంచి కూడా బయటకు రాలేదు. సిరీస్ రద్దుతో ప్రస్తుతం వారు న్యూజిలాండ్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, భద్రత విషయంలో స్వయంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖానే కివీస్ క్రికెటర్లకు భరోసా ఇచ్చినా.. వారు తిరస్కరించినట్లు తెలుస్తుంది.

మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు సిరీస్‌ను రద్దు చేసుకోవడంపై పలువురు పాక్ మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మంత్రులు కూడా అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించాడు. సిరీస్‌ రద్దు చేసుకోవడంపై పాకిస్తాన్‌ను చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ” కివీస్ టీం పాకిస్తాన్‌ క్రికెట్‌ను చంపేసింది. షడన్‌‌గా సిరీస్‌ రద్దు చేసుకున్న న్యూజిలాండ్ ముందు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నా. క్రైస్ట్‌చర్చి పేలుడులో 9 మంది పాకిస్తానీలు మరణించారు. అప్పుడు మీకు భద్రత గుర్తుకురాలేదా? ఆ విషయంలో న్యూజిలాండ్‌కు మద్దతుగా పాకిస్తాన్ నిలిచింది. కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్న టైంలో పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటించింది. మరి మా ఆటగాళ్లకు ఎలాంటి భద్రత ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు” అంటూ విమర్శలు చేశారు.

సెక్యూరిటీ అలర్ట్‌ లేదు.. ఏమీ లేదు.. కివీస్‌దంతా వట్టి డ్రామానే.. హామీ ఇచ్చి సిరీస్‌ను రద్దు చేసుకోవడం చాలా దారుణం అంటూ షాహిద్‌ అఫ్రిది మండిపడ్డారు. ఈ సిరీస్ రద్దు కావడంతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. “సిరీస్‌ రద్దుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ, మా ప్లేయర్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పాక్ బోర్డు బాగానే ఆతిథ్యం ఇచ్చింది” అంటూ ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్​ వెల్లడించాడు. పాక్‌ పర్యటనలో భాగంగా కివీస్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జరగాల్సి ఉంది.

Also Read: IPL 2021: ఐపీఎల్ చరిత్రలో 19 హ్యాట్రిక్‌లు.. లిస్టులో ఈ ముగ్గురు భారత బౌలర్లను చూస్తే ఆశ్చర్యపోతారంతే..!

Virat Kohli vs Anil Kumble: అనిల్ కుంబ్లే 2017లో కోచ్ పదవికి ఎందుకు రాజీనామా చేశారు? కోహ్లీ, కుంబ్లేల మధ్య అసలేం జరిగిందో తెలుసా?

IPL 2021: 14 ఏళ్ల ఎదురుచూపులు ఫలించేనా..? ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత మర్చేందుకు సిద్ధమంటోన్న రిషబ్ పంత్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu