Virat Kohli vs Anil Kumble: అనిల్ కుంబ్లే 2017లో కోచ్ పదవికి ఎందుకు రాజీనామా చేశారు? కోహ్లీ, కుంబ్లేల మధ్య అసలేం జరిగిందో తెలుసా?

అనిల్ కుంబ్లే 2016 లో టీమిండియా కోచ్‌గా ఎన్నికయ్యాడు. కానీ, విరాట్ కోహ్లీతో వివాదం కారణంగా 2017 లో కుంబ్లే తన పదవికి రాజీనామా చేశారు.

Virat Kohli vs Anil Kumble: అనిల్ కుంబ్లే 2017లో కోచ్ పదవికి ఎందుకు రాజీనామా చేశారు? కోహ్లీ, కుంబ్లేల మధ్య అసలేం జరిగిందో తెలుసా?
Virat Kohli Vs Anil Kumble
Follow us
Venkata Chari

|

Updated on: Sep 18, 2021 | 12:28 PM

Virat Kohli vs Anil Kumble: టీ 20 ప్రపంచకప్ తర్వాత, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో తన కెప్టెన్సీని వదులుకోనున్నాడు. ఈ ప్రపంచకప్ తర్వాత కోహ్లీ తప్పుకోవడం ఓ వార్త అయితే, టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీకాలం కూడా ముగిసిపోనుంది.ఇలాంటి పరిస్థితిలో మీడియా నివేదికల ప్రకారం జట్టు తదుపరి కోచ్ కోసం బీసీసీఐ అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌తో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం ప్రస్తుతం కుంబ్లే టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే కుంబ్లే భారత కోచ్ కావడం ఇదేం మొదటిసారి కాదు. దీనికి ముందు కుంబ్లే 2016 లో జట్టు కోచ్‌గా పనిచేశాడు. అయితే విరాట్ కోహ్లీతో విభేదాల తర్వాత కుంబ్లే తన పదవికి రాజీనామా చేశారు.

ఆ సమయంలో బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (COA), క్రికెట్ సలహా కమిటీ (CAC) సిఫార్సు మేరకు కుంబ్లేను కోచ్‌గా నియమించారు. ఆ సమయంలో బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్‌లు CACలో భాగంగా ఉన్నారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ముగ్గురు కుంబ్లే పేరును తెరపైకి తీసుకొచ్చారు. కుంబ్లే మార్గదర్శకత్వంలో జట్టు బాగా రాణిస్తోంది. టీమిండియా 2-0తో వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.

ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీతో విబేధాలు.. ఆ సమయంలో మీడియా నివేదికల ప్రకారం, కోహ్లీ, కుంబ్లే‌ల మధ్య వివాదం ఆస్ట్రేలియా భారత పర్యటనతో ప్రారంభమైంది. టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గాయం కారణంగా ఆడలేదు. అజింక్యా రహానే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, జట్టు ఎంపికలో మాత్రం కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ విషయంలో కుంబ్లేతో గొడవపడ్డాడు. ధర్మశాల టెస్టులో కుల్దీప్‌కు చోటు ఇవ్వాలా వద్దా అన్న విషయమై ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. అయితే, కుల్దీప్ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక్కడ నుంచి విరాట్, కుంబ్లేల మధ్య వివాదం వార్తల్లో కూడా నిలిచింది. ఇది కాకుండా అప్పటి బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించాలని, జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని కుంబ్లే కోరుకున్నాడు.

ఆశ్చర్యపరిచిన బీసీసీఐ నిర్ణయం.. 2017లో కుంబ్లే పదవీకాలం ముగిసింది. ఇలాంటి పరిస్థితిలో బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులను కోరి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో కుంబ్లే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. కుంబ్లే ప్రవర్తనతో కోహ్లీతోపాటు జట్టులోని మరికొందరు సభ్యులు సంతోషంగా లేరని వార్తలు వినిపించాయి. అయితే కుంబ్లేతో వివాదానికి సంబంధించిన చర్చను కోహ్లీ తోసిపుచ్చాడు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీలో వివాదానికి సంబంధించిన వివాదం కూడా బయటకు పొక్కింది.

కుంబ్లే రాజీనామా.. కుంబ్లేతో వివాదాస్పదమైన విషయాన్ని కోహ్లీ నిరంతరం ఖండిస్తూనే ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా కోహ్లీ అదే పని చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, భారత్ తన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఓడిపోయింది. దీని తర్వాత, భారత టీం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. కుంబ్లే లేకుండా కరేబియన్ దేశానికి బయలుదేరింది. కుంబ్లే గైర్హాజరు విషయంపై మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీకి అధిపతిగా ఉన్నందున, దాని సమావేశం కోసం ఆగిపోయాడంటూ బీసీసీఐ కవర్ చేసింది. అయితే కుంబ్లే తన పదవికి రాజీనామా చేయడంతో అసలు విషయం బయటకు పొక్కొంది. కుంబ్లే తన రాజీనామాలో కోహ్లీతో విభేదాలను పేర్కొంటూ బీసీసఐకి లేక సర్పించాడు. దీంతో బీసీసీఐ రవిశాస్త్రిని హెచ్ కోచ్‌గా నియమించింది.

Also Read: IPL 2021: 14 ఏళ్ల ఎదురుచూపులు ఫలించేనా..? ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత మర్చేందుకు సిద్ధమంటోన్న రిషబ్ పంత్

Teamindia Head Coach: హెడ్ కోచ్‌ రేసులో టీమిండియా మాజీ లెజెండ్‌లు.. కోహ్లీకి నచ్చని వ్యక్తికే పగ్గాలు.. గంగూలీ ప్లాన్ ఏంటంటే?