అమిత్ మిశ్రాను ఐపీఎల్‌లో హ్యాట్రిక్ మ్యాన్ అని కూడా అంటారు. దీనికి కారణం అతని పేరు మీద అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన రికార్డు నెలకొని ఉంది. ఢిల్లీకి చెందిన లెగ్ స్పిన్నర్ ఐపీఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. 2008లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన మిశ్రా.. డెక్కన్ ఛార్జర్స్‌కు చెందిన రవీంద్ర జడేజా, ప్రగ్యాన్ ఓజా, ఆర్‌పీ సింగ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చి తొలి హ్యాట్రిక్ సాధించాడు. దీని తరువాత 2011 లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడుతూ పంజాబ్ కింగ్స్‌కు చెందిన ర్యాన్ మెక్‌లారెన్, మన్ దీప్ సింగ్, ర్యాన్ హారిస్‌లను ఔట్ చేసి రెండవ హ్యాట్రిక్ సాధించాడు. 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగి భువనేశ్వర్ కుమార్, రాహుల్ శర్మ, పూణే వారియర్స్‌కు చెందిన అశోక్ దిండాను ఔట్ చేసి మూడవ హ్యాట్రిక్ సాధించాడు.