AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: 14 ఏళ్ల ఎదురుచూపులు ఫలించేనా..? ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత మర్చేందుకు సిద్ధమంటోన్న రిషబ్ పంత్

కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ తిరిగొచ్చినా టీమ్ మేనేజ్‌మెంట్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

IPL 2021: 14 ఏళ్ల ఎదురుచూపులు ఫలించేనా..? ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత మర్చేందుకు సిద్ధమంటోన్న రిషబ్ పంత్
Delhi Capitals
Venkata Chari
|

Updated on: Sep 18, 2021 | 11:19 AM

Share

Delhi Capitals: ఐపీఎల్ 2021 రెండవ దశ రేపటి నుంచి మొదలుకానుంది. ఈమేరకు యూఏఈలో రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్‌టీంల మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. మిగిలిన జట్లతో పోలిస్తే ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణిస్తోంది. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఢిల్లీ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా లీగ్ మొదటి దశ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కు అవకాశం దక్కింది. రిషబ్ కెప్టెన్సీలో జట్టు ఆటలో ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ రెండో దశకు అందుబాటులోకి వచ్చాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించుకుంది. కొత్త కెప్టెన్ సవాలు ప్రస్తుతం ఇంకాస్త పెరిగిందని స్పష్టమవుతోంది.

14 ఏళ్ల కరవు తీరేనా.. 14 సంవత్సరాల కరవును తీర్చుకోవాలనే నిర్ణయంతో బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. మరి రిషబ్ పంత్ హయాంలోనైనా ఈ కల సాకారమవుతుందో లేదో చూడాలి. ఇంతవరకు ఢిల్లీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. గత సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. మొదటిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ జట్టు కేవలం ఒకడుగు దూరంలో నిలిచిపోయింది. ప్రస్తుత ఫాం చూస్తుంటే మాత్రం ఈసారి ట్రోఫీ కరవును తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.

కొత్త కెప్టెన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తోంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో, ఐపీఎల్ 2021 మొదటి దశలో జట్టు బాగా రాణించింది. భారత్‌లో జరిగిన తొలి దశలో ఢిల్లీ జట్టు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 గెలిచి 12 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. యూఏఈలో ఢిల్లీ జట్టు గ్రూప్ దశలో మరో 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ యూఏఈ షెడ్యూల్:

22 సెప్టెంబర్ (బుధవారం): ఢిల్లీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు, దుబాయ్

25 సెప్టెంబర్ (శనివారం): ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, మధ్యాహ్నం 3:30 గంటలకు, అబుదాబి

28 సెప్టెంబర్ (మంగళవారం): ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్, మధ్యాహ్నం 3:30 గంటలకు, షార్జా

02 అక్టోబర్ (శనివారం): ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్, మధ్యాహ్నం 3:30 గంటలకు, షార్జా

04 అక్టోబర్ (సోమవారం): ఢిల్లీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, రాత్రి 7:30 గంటలకు, దుబాయ్

08 అక్టోబర్ (శుక్రవారం): ఢిల్లీ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు, దుబాయ్

ఈ 6 మ్యాచ్‌లలో సగం మ్యాచులు గెలిచినా.. ఢిల్లీ జట్టు ప్లే-ఆఫ్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: Teamindia Head Coach: హెడ్ కోచ్‌ రేసులో టీమిండియా మాజీ లెజెండ్‌లు.. కోహ్లీకి నచ్చని వ్యక్తికే పగ్గాలు.. గంగూలీ ప్లాన్ ఏంటంటే?

భారత్‌పై అరంగేట్రం.. ప్రతి మ్యాచ్‌లో యావరేజ్‌గా 3 వికెట్లు.. పక్షవాతంతో క్రికెట్‌కు దూరమైన ఆటగాడెవరంటే?

IPL 2021: తొలిసారి ఐపీఎల్‌ ఆడనున్న విదేశీ ఆటగాళ్లు.. బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ టీంల జాతకం మార్చేనా?