Pak Supports Taliban : పాకిస్తాన్‌ చెవుల్లో అమృతం.. తాలిబన్లతో పాక్‌ గాఢానుబంధం..(వీడియో)

Pak Supports Taliban : పాకిస్తాన్‌ చెవుల్లో అమృతం.. తాలిబన్లతో పాక్‌ గాఢానుబంధం..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 19, 2021 | 3:15 PM

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా దళాలు వైదొలుగుతున్నాయన్న మాట పాకిస్తాన్‌ చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించి ఉంటుంది.. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌ను తాలిబిన్లు ఆక్రమించారనే వార్త మహదానందాన్ని కలిగించి ఉంటుంది. తాలిబన్లతో ఎప్పుడు చేతులు కలుపుదామా..?

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా దళాలు వైదొలుగుతున్నాయన్న మాట పాకిస్తాన్‌ చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించి ఉంటుంది.. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌ను తాలిబిన్లు ఆక్రమించారనే వార్త మహదానందాన్ని కలిగించి ఉంటుంది. తాలిబన్లతో ఎప్పుడు చేతులు కలుపుదామా? ఎప్పుడు తాలిబన్ల ప్రభుత్వంలో దూరిపోదామా అని ఆరాటపడ్డ పాకిస్తాన్‌ అన్నంత పనీ చేసింది. ప్రభుత్వంలో తనవాళ్లను దూర్చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ప్రవచనాలు చెబుతోంది.. తాలిబన్లతో కలిసి పని చేయడానికి ముందుకు రావాలంటూ ఓ పిలుపిచ్చింది. అఫ్గాన్‌ మహిళల హక్కులను కాపాడటానికి చొరవ చూపాలని పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అంతర్జాతీయ సమాజానికి విన్నవించుకున్నారు. పైగా అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొనాలంటే తాలిబన్లతో కలిసి పని చేయాలని ఇమ్రాన్‌ఖాన్‌ సెలవిస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న అఫ్గానిస్తాన్‌ను ఆదుకోవలసిన బాధ్యత అందరిమీదా ఉందని మొహమాటం లేకుండా అంటున్నారు. అఫ్గానిస్తాన్ మొత్తం తాలిబన్ల కంట్రోల్‌లోకి వచ్చేసిందని చెప్పిన ఇమ్రాన్‌ఖాన్‌ వారు అన్ని వర్గాలను కలుపుకుని వెళితే అఫ్గాన్‌లో శాంతి నెలకొంటుందని చెప్పారు. ఒకవేళ వారు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లకపోతే మాత్రం పరిస్థితులు భిన్నంగా మారే అవకాశం ఉంటుందన్నారు. హింస ప్రజ్వరిల్లే ఛాన్స్‌ లేకపోలేదన్నారు. అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందన్నారు ఇమ్రాన్‌ఖాన్‌.

తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ …ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబన్లపై ఒత్తిడి తెచ్చి మహిళల హక్కులను కాపాడలేమన్నారు. అఫ్గాన్‌ మహిళలు సహజంగా ధైర్యవంతులని, కొంచెం టైమిస్తే వారి హక్కులను వారే పొందగలరని ఇమ్రాన్‌ తెలిపారు.పనిలో పనిగా అమెరికాపై కాసింత నిందలు వేశారు. ఉగ్రవాదంపై అమెరికా చేసిన పోరులో అనవసరంగా భాగస్వామ్యమయ్యామని, దీనివల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని పాక్‌ ప్రధాని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా తమను ఓ పావులా వాడుకుందని ఆరోపించారు. నైన్‌ బై లెవన్‌ దాడుల తర్వాత అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్‌ కుట్రపూరితంగా వ్యవహరించని అమెరికా చేస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ల సారథ్యంలో ఏర్పడిన అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వంలో చాలా మంది టెర్రరిస్టులే ఉన్నారు. అది కూడా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రకటించిన టెర్రరిస్టు బ్లాక్‌లిస్టులో ఉన్నవారే ఇప్పుడు మంత్రులయ్యారు. అంతెందుకు ప్రధానమంత్రి, ఇద్దు ఉప ప్రధానమంత్రులు కూడా టెర్రరిస్టు బ్లాక్‌లిస్టులో ఉన్నవారే కావడం గమనార్హం. దీన్ని బట్టి అఫ్గానిస్తాన్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో ఊహించుకోవచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ : Car In Flood Viral Video: వరద నీటిలో కారు ప్రయాణం.. ఆశ్చర్యపోయానన్న ఆనంద్‌ మహీంద్ర..!(వీడియో)

 Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణపతి(వీడియో)

 కరకట్టపై పొలిటికల్‌ గజగజ.. యుద్ధ వాతావరణంలో ఉండవల్లి అతలాకుతలం..: YCP vs TDP Political Heat in AP Video.