Sleep tips: మంచి నిద్ర కోసం ఈ 5 పనులు చేస్తే చాలు..! మందులు అవసరం లేదు..

Sleep tips: సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి సరైన నిద్ర ఉండదు. దీని కారణంగా మరుసటి రోజు చాలా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఇది కాకుండా

Sleep tips: మంచి నిద్ర కోసం ఈ 5 పనులు చేస్తే చాలు..! మందులు అవసరం లేదు..
Sleep
Follow us
uppula Raju

|

Updated on: Sep 19, 2021 | 4:06 PM

Sleep tips: సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి సరైన నిద్ర ఉండదు. దీని కారణంగా మరుసటి రోజు చాలా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఇది కాకుండా ఏ పని చేయాలని అనిపించదు. కొన్నిసార్లు అధిక ఒత్తిడి కారణంగా నిద్రపోవడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో జనాలు మందులను ఆశ్రయిస్తున్నారు. మందులు ఆరోగ్యానికి హానికరమని అందరికి తెలుసు. అయినా తప్పడం లేదంటున్నారు. ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి టాబ్లెట్లు వేసుకోకూడదు. సరైన నిద్ర కోసం ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

1. గాడ్జెట్‌లను స్విచ్ ఆఫ్ చేయండి చాలా మంది వ్యక్తులు ఎక్కువ సమయాన్ని గాడ్జెట్‌లతో గడుపుతారు. దీనివల్ల కంటిచూపు బలహీనపడుతుంది. ఇది కాకుండా వాటి నుంచి వెలువడే బ్లూ-రే ఆరోగ్యానికి హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు స్క్రీన్‌కు దూరంగా ఉన్నప్పుడు మెలటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ పీనియల్ గ్రంథి నుంచి విడుదలవుతుంది ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది. అందువల్ల రాత్రిపూట నిద్రించడానికి గంట ముందు అన్ని గాడ్జెట్‌లను ఆపివేయాలి.

2. పుస్తకాలు చదవాలి పుస్తకం చదవడం మంచి అలవాటు. దీనివల్ల మనస్సు రిలాక్స్ అవుతుంది. నిద్రించే ముందు మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవవచ్చు.

3. వేడిగా ఏదైనా తాగండి కొన్ని వేడి పానీయాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పసుపు పాలు తాగితే మెదడుకు, పేగుకు ప్రయోజనకరంగా ఉంటుంది.

4. పడుకునే ముందు స్నానం చేయండి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంచి నిద్ర కోసం స్నానం చేయడం మంచి ఎంపిక. ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యత కూడా బాగుంటుంది.

5. శ్వాస వ్యాయామాలు చేయండి చదవడానికి వింతగా ఉండవచ్చు కానీ నిద్రపోయే ముందు శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. యోగా నిపుణులు, ఆధ్యాత్మిక గురువులు నిద్రించే ముందు శ్వాస వ్యాయామాలు చేయాలని సిఫార్సు చేస్తారు. నిజానికి నిద్రపోయే ముందు ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర కూడా బాగా వస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి