Inspiring Story: అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళ.. కష్టాలను ఎదుర్కొని నేడు పోలీస్ అధికారిగా మారిన వైనం..

Inspiring Story:మహిళలు మహారాణులు.. అంబరాన్ని అందుకుంటున్నారు.. సముద్రపు లోతులను కొలుస్తున్నారు.. అయితే అత్తవారింటి వేధింపులకు ఎంతటివారైనా బలిఅవుతున్నారు. చదువు, ఆర్ధిక పరిస్థితి ఇవి ఏమీ అత్తవారింటి..

Inspiring Story: అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళ.. కష్టాలను ఎదుర్కొని నేడు పోలీస్ అధికారిగా మారిన వైనం..
Kerala Police Cop
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2021 | 5:11 PM

Inspiring Story:మహిళలు మహారాణులు.. అంబరాన్ని అందుకుంటున్నారు.. సముద్రపు లోతులను కొలుస్తున్నారు.. అయితే అత్తవారింటి వేధింపులకు ఎంతటివారైనా బలిఅవుతున్నారు. చదువు, ఆర్ధిక పరిస్థితి ఇవి ఏమీ అత్తవారింటి వేధింపుల నుంచి రక్షించలేవు.. అయితే వాటినుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఆత్మహత్య చేసుకుని తమ నిండు నూరేళ్ళ జీవితానికి ముగింపు ఇస్తే.. అతి తక్కువమంది స్త్రీలు మాత్రం వేధింపులనుంచి బయపడి.. తమని తాము నిరూపించుకుంటూ.. ఉన్నత స్థానికి చేరుకుంటున్నారు. సమాజంలో తమకంటూ ఓ పీజీని లిఖించుకుంటున్నారు. అటువంటి స్ఫూర్తి వంతమైన మహిళలను ఆదర్శంగా తీసుకుని.. మరింతమంది మహిళలు జీవితంలో కష్టనష్టాలను ఎదిరించి పోరాడాలని.. విజయం సాధించాలని కోరుకుంటూ.. ఈరోజు అత్తింటి కష్టాల కడలిని ఈది… ఈ రోజు కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పూర్తి చేసి పోలీస్‌ ఆఫీసర్‌ గా విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా అధికారి గురించి తెలుసుకుందాం..

కేరళలోని కోళికోద్‌ కు చెందిన నౌజిషా. జీవితంలో 2016 ఎప్పటికీ గుర్తు ఉండే సంవత్సరం. ఎందుకంటే 2013 లో పెళ్లైన నౌజిషా ఎన్నో కలలతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. ఈ మూడేళ్ల వైవాహిక జీవితంలో అత్తింటి వారి హింస, వేధింపులు తప్ప ఆదరణ ప్రేమ దక్కలేదు. అయితే ఒక కొడుకు జన్మించాడు. అయినప్పటికీ అత్తవారింట్లో పరిస్థితి ఎక్కడా మార్పులేదు. దీంతో జీవితం మీద విరక్తితో నౌజిషా బావిలో దూకి ప్రాణాలను తీసుకోవాలని భావించించారు. అయితే అప్పుడు ఆ క్షణంలో నౌజిషాకి అమాయకమైన తన కొడుకు గుర్తుకొచ్చాడు. ఇప్పటికే తండ్రి అదరణలేదు.. తాను కూడా మరణిస్తే.. తన కొడుకు జీవితం ఏమైపోతుంది అని ఆలోచించారు. అదే సమయంలో తనని ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. దీంతో ఆత్మహత్య నిర్ణయం మార్చుకుని తన కొడుకుని తీసుకుని పుట్టింటికి చేరుకున్నారు.

నౌజిషా పెళ్లి చేసుకునే సమయంలోనే బీఎస్సీ మాథ్స్, కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ చేసి ఒక ఏడాది పాటు ఓ కాలేజ్‌లో గెస్ట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. ఇదే విషయం పెళ్లి చూపుల సమయంలో పెళ్లికుమారుడికి చెప్పి.. తాను భవిష్యత్ లో మరింత ఆర్ధికంగా స్థిరపడడానికి కెరీర్ లో ఎదగాలని భావిస్తున్నాని చెప్పారు. అప్పుడందరూ అంగీకరించారు. అయితే పెళ్ళికి ముందు ఇచ్చిన మాట.. వివాహం అనంతరం మరచిపోయారు. నౌజిషా పెళ్లి అనంతరం వంటింటికి పరిమితమైపోయింది. తన భర్త ప్రవర్తనకు కారణం.. ఆయనకు ఉన్న వివాహేతర సంబంధం అని నౌజిషాకు తెలిసింది. ఈ విషయంపై ప్రశ్నించిన నౌజిషాకు రోజు రోజుకీ అత్తారింట్లో వేధింపు ఎక్కువ అయ్యాయి. ఏకంగా కొట్టేవరకు వెళ్లింది ఇంట్లో వాతావరణం. అయితే తాను తిరిగి పుట్టింటికి వెళ్తే.. అమ్మానాన్నలు అవమానముగా భావిస్తారేమో అంటూ ఆందోళన పడిన నౌజిషను పుట్టింటివారు ఆదరించారు.  కష్టాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు కడుపులో దాచుకున్నారు. వెంటనే భర్తకు విడాకుల నోటీసు పంపించింది.

తన కొడుకుతో పుట్టింటికి చేరుకున్న నౌజిషా వారిమీద ఆధారపడి బతకాలని నిర్ణయించుకోలేదు. వెంటనే కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరింది. పగలు ఉద్యోగం చేస్తూ, సాయంత్రం కేపీఎస్‌సీ కోచింగ్‌ క్లాసులకు హాజరైంది. 2018లో తొలి ప్రయత్నంలో రాత పరీక్షలో పాస్ అయ్యింది. అయితే అప్పుడు ఫిజికల్ టెస్ట్ కు అటెండ్ కాలేకపోయారు. దీంతో మళ్ళీ 2020 లో పరీక్షలను రాశారు. విజయం సాధించిన నౌజిషా ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రైనీ పోలీస్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. ఇదే విషయంపై స్పందిస్తూ.. ”భర్త వేధింపుల నుంచి రక్షించమని పోలీసులను ఆశ్రయించిన నేను ఇప్పుడు పోలీస్‌ అధికారినయ్యాను.  అందుకనే తాను సమాజంలో ఇప్పటికీ అత్తారింటిలో వేధింపులకు గురవుతున్న మహిళలకు చెప్పేది ఒక్కటే… వేధింపులను మౌనంగా భరించకండి. నోరు తెరవండి. మిత్ర హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయండి’ అని ధైర్యం చెబుతోంది. మీ కష్టాలను జయించి జీవితాన్ని గెలవాలంటే తననే ఆదర్శంగా తీసుకోమని చెబుతున్నారు నౌషాజీ.

Also Read:Left Arm Pain: అన్ని సార్లు ఎడమ చేయి నొప్పి.. గుండె సమస్యలకు కారణం కాదు.. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.. అవిఏమిటంటే..