AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulse Pressure: విశ్రాంతి సమయంలో నాడి వేగం గుండె పనితీరుకి చిహ్నం.. ఎలా నాడివేగాన్ని గుండె వేగాన్ని చూసుకోవాలంటే..

Pulse Pressure: కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మనిషి శరీరం పని తీరు, జ్వరం వంటివి తెలుసుకోవడానికి నాడి పట్టుకుని తెలుసుకునేవారు. నాలిక , కళ్ళను చూసి..

Pulse Pressure: విశ్రాంతి సమయంలో నాడి వేగం గుండె పనితీరుకి చిహ్నం.. ఎలా నాడివేగాన్ని గుండె వేగాన్ని చూసుకోవాలంటే..
Pulse
Surya Kala
|

Updated on: Sep 19, 2021 | 6:05 PM

Share

Pulse Pressure: కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మనిషి శరీరం పని తీరు, జ్వరం వంటివి తెలుసుకోవడానికి నాడి పట్టుకుని తెలుసుకునేవారు. నాలిక , కళ్ళను చూసి ఆరోగ్యాన్ని అంచనా వేసేవారు. అయితే కాలంతో పాటు ఎన్నో మార్పు వచ్చాయి. అందులో భాగంగా వైద్యంలో కూడా మార్పులు వచ్చాయి. అయితే ఇప్పటికీ నాడి పనితీరుతో మన ఆరోగ్య పరిస్థితిని అంచనావేయవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా విశ్రాంతిగా కూర్చున్న సమయంలో మణికట్టు దగ్గర వేళ్లతో అదిమి నాడిని పరీక్షిస్తే.. గుండెపనితీరు తెలుస్తుంది.

విశ్రాంతి సమయంలో నాడిని బట్టి.. గుండె వేగాన్ని అంచనా వేసి.. తద్వారా మన ఆరోగ్యస్థితిని, మున్ముందు తలెత్తే సమస్యలను అంచనా వేయొచ్చని అంటున్నారు. ఎందుకంటే నాడిని చూసి ఆరోగ్యస్థితిని అంచనా వేసే మార్గాల్లో అతి సులభమైంది. నాడి బట్టి.. 30 సెకండ్లలోనే మన గుండె కండరం పనితీరును తెలుసుకోవచ్చు. ఇది ఇప్పటి వారి కంటే.. మన తాతముత్తాతలు ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే నాడితో గుండె వేగం చూడడం అంటే.. ముందుగా మణికట్టు వద్ద బొటనవేలు కిందిభాగంలో పట్టుకుని చూస్తే నాడి కొట్టుకోవడం తెలుస్తోంది. కొంతమంది నాడిని మెడకు ఒక పక్కన రెండు వేళ్లతో ఒకింత గట్టిగా అదిమిపడి పట్టుకుని తెలుసుకుంటారు. ఇలా నాడి వేగాన్ని ఎవరికీ వారు కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే కొంచెం నాడి వేగాన్ని అంచనావేసే పరిశీలన ఉండాలి. అలాంటి వారు ఎవరికి వారే నాడి కొట్టుకోవటాన్ని తెలుసుకోవచ్చు.

ఇక నాడి వేగం బట్టి గుండె వేగాన్ని ఎలా అంచనా వేయాలంటే..

విశ్రాంతి తీసుకున్న సమయంలో నాడి 30 సెకండ్ల సమయంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కించి, దాన్ని రెట్టింపు చేస్తే ఒక నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. అంటే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటె.. మీ శారీరక సామర్ధ్యం అంత హెల్దీగా ఉందని అర్ధం. ఇక ఇలా తక్కువ గుండె వేగం వస్తే.. మీ గుండె భద్రంగా ఉందని.. ఇలాంటివారికి గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా తక్కువని పరిశోధకులు అంటున్నారు. అంతేకాదు విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటె.. అటువంటివారికి గుండె సమస్యలు అధికంగా వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు గుండె వేగం ఎక్కువ ఉన్నవారిలో శారీరక సామర్థ్యం తక్కువగానూ.. రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇటువంటివారు హఠాత్తుగా మరణించే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకనే విశ్రాంతి సమయంలో నాడి వేగం ఎక్కువగా ఉంటె వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

నాడి వేగం చూసుకోవడానికి ఉత్తమ సమయం:

ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం మీది నుంచి దిగకముందే నాడి వేగాన్ని పరీక్షించుకోవడం.. తద్వారా గుండె వేగాన్ని అంచనా వేయడం ఉత్తమమని అంటున్నారు. ఇక శారీరక శ్రమ, వ్యాయామం వంటివి చేస్తే రెండు గంటలు విశ్రాంతి తీసుకుని నాడి వేగాన్ని పరిశీలించుకోవాలి. కాఫీ, టీ వంటివి తాగితే అరగంట తర్వాతే నాడి చూసుకోవాలని సూచిస్తున్నారు.

విశ్రాంతిగా ఉన్నప్పుడు పెద్దవారిలో సాధారణంగా గుండె నిమిషానికి 60-100 సార్లు కొట్టుకుంటుంది. అయితే పెద్దవారిలో 50-70 సార్లు ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. 80 కంటే ఎక్కువగా గుండె వేగం ఉంటె.. వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.

Also Read: అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళ.. కష్టాలను ఎదుర్కొని నేడు పోలీస్ అధికారిగా మారిన వైనం..