Nalla Ummethha: స్త్రీలు స్తనాల వాపులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆకులు దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే

Nalla Ummethha: ఉమ్మెత్త మొక్క అందరికీ తెలిసిందే.. ఇక ఉమ్మెత్త ఆకుని వినాయక చవితికి.. పువ్వులను శివుడి పూజకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు..

Nalla Ummethha: స్త్రీలు స్తనాల వాపులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆకులు దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే
Nalla Ummetta
Follow us

|

Updated on: Sep 19, 2021 | 9:33 PM

Nalla Ummethha: ఉమ్మెత్త మొక్క అందరికీ తెలిసిందే.. ఇక ఉమ్మెత్త ఆకుని వినాయక చవితికి.. పువ్వులను శివుడి పూజకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఉమ్మెత్త మొక్కల్లో అత్యుత్తమ మూలికలు కలిగి ఉన్నాయి. వీటిల్లో మూడు రకాల చెట్లు ఉన్నాయి.అవి

1 – తెల్ల పువ్వులు పూసే ఉమ్మెత్త . 2 – పసుపు పచ్చ పూసే పచ్చ ఉమ్మెత్త. 3 – నల్ల పువ్వులు పూసే నల్ల ఉమ్మెత్త .

అయితే నల్ల ఉమ్మెత్త మొక్క ఉమ్మెత్త పువ్వులు వంకాయ రంగులో ఉంటాయి. ఇది వగరు ,చేదు , తీపి రుచులు కలిగి శరీరానికి మత్తు, పైత్యం , వేడి పుట్టిస్తుంది. కుష్టు, దురదలు, కురుపులు, గడ్డలు, అన్ని వ్రణాలు హరించి వేస్తుంది. ఉబ్బసానికి దీని పొగ పీల్చడం పురాతన సాంప్రదాయం. ఇంకా చెప్పాలంటే నల్ల ఉమ్మెత్త మొక్క ఆరోగ్యప్రయోజనాలు అనేకం. ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి వ్యాధులకు ఈ చెట్టు చెక్ పెడుతుంది.. ఈ రోజు నల్ల ఉమ్మెత్త చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

*తలపై కురుపులతో ఇబ్బంది పడేవారు నల్ల ఉమ్మెత్తకు నలగగొట్టి ఆముదంతో నూరి ఉడకబెట్టి ఆ ముద్దను కురులపై లేపనం వేస్తె తల కురుపులు తగ్గిపోతాయి . * అరికాళ్ళ మంటలు తగ్గుటకు నలల ఉమ్మెత్తకు రసం , దొండాకు రసం, చిక్కుడాకు రసం సమంగా కలిపి అరికాళ్ళకు మర్దన చేస్తూ ఉంటే మంటలు తగ్గుతాయి. * నలల ఉమ్మేత్తాకు నలగగొట్టి సమంగా ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి ఉడకబెట్టి దానిని గోరువెచ్చగా గడ్డలపై వేసి కట్టు కడుతూ ఉంటే శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ గడ్డలు పగిలి మానిపోతాయి .\ *నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకొని శుభ్రపరుచుకోవాలి. ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. 100 గ్రాముల నల్ల ఉమ్మెత్త ఆకుల రసానికి 100 గ్రాముల నువ్వుల నూనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాసుకుంటే గజ్జి, తామర, దురద, అలర్జీ అన్నీ తగ్గుతాయి. అంతేకాదు పేను కొరుకుడుతో ఇబ్బందిపడేవారికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. *నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని పారబోసి.. నల్ల ఉమ్మెత్త ఆకులు ఎండబెట్టలి. ఎండిన తర్వాత ఈ ఆకులను మజ్జిగ లో కలిపి తీసుకుంటే అనేక రకాల చర్మ సంబంధ సమస్యలను నివారిస్తుంది. *అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న పురుషులకు నల్ల ఉమ్మెత్త చెట్ల వేర్లు దివ్య ఔషధమని చెప్పవచ్చు. ముందుగా చెట్టు వేర్లు ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని గోమూత్రంలో కలిపి రాసుకుంటే అంగస్తంభన సమస్య తగ్గుతుంది. *ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న చోట రాసి కట్టు కడితే శరీరం లో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. *స్త్రీల స్తనాల వాపులకు ఈ ఆకులపై నువ్వుల నూనె రాసి వేడి సెగ చూపించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతాయి. *అంతేకాదు ఈ నువ్వుల నూనె రాసిన ఆకులను తల నొప్పి ఉన్న చోట ఉంచితే త్వరగా తగ్గుతుంది.

గమనిక: ఈ నల్ల ఉమ్మెత్త ఆకులను పైపూతగా మాత్రమే ఉపయోగించాలి. అంతేగానీ ఆకులను తినకూడదు. ఈ రకుల ఆ రసాన్ని సేవించకూడదు ఎందుకంటే ఇది కొంచెం విషపూరితమైనది.

Also Read: సునామీ కూడా తాకని సుబ్రమణ్య స్వామి టెంపుల్.. ఇక్కడ విభూతికి రోగాలను తగ్గిస్తుందని నమ్మకం..