Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subramaniya Swamy: సునామీ కూడా తాకని సుబ్రమణ్య స్వామి టెంపుల్.. ఇక్కడ విభూతికి రోగాలను తగ్గిస్తుందని నమ్మకం

Subramaniya Swamy Temple: తమిళనాడులో సుబ్రహ్మణేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి,..

Subramaniya Swamy: సునామీ కూడా తాకని సుబ్రమణ్య స్వామి టెంపుల్.. ఇక్కడ విభూతికి రోగాలను తగ్గిస్తుందని నమ్మకం
Subramaniya Swamy Temple
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2021 | 9:01 PM

Subramaniya Swamy Temple: తమిళనాడులో సుబ్రహ్మణేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, మురుగన్ గా పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలున్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఈ క్షేత్రంలో విడిది చేసినట్లు స్థలపురాణం. సుబ్రమణ్య స్వామిని పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల కథనం.

“తిరుచెందూర్” లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర, సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడనుంచే బయలుదేరారట. అందుకే ఇక్కడ స్వామి వారు తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా శక్తివంతమైన క్షేత్రం.

సర్వ సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరాలపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. వర్ణించతరముకాదు. అంతేకాదు ఇక్కడ విభూతి మహిమానిత్వమైనదని భక్తుల నమ్మకం

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులవారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్యస్వామి భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాల్లో నాగ దోషం లేదా కాల సర్ప దోషాన్ని తొలగిస్తుంది. వంశంలో ఉన్న దోషాలతో సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవ వాటితో ఇబ్బందులు పడేవారు ఈ క్షేత్ర దర్శనంతో దోష విముక్తి అవుతారు.

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివిన వారికీ ఈ భుజంగం ప్రభావము వలన వారికీ ఉన్న సకల దోషాలు తొలగి.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి బుద్ధి వచ్చి, ఇష్టకామ్యములు (ధర్మబద్ధమైన) నెరవేరుతాయి. ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే 2006 లో వచ్చిన సునామి వల్ల, ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామి వారి శక్తి అంటూ భక్తులు చెబుతారు.

తిరుచెందూర్ విభూతి మహిమ:

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన ‎విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

ఈ క్షేత్రం తమిళనాడు లో ‎తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉంది.

Also Read: Songbirds Crash: పక్షుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్న ఆకాశ హార్మ్యాలు..వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో మృతి..