Skin Problems-Ayurveda Tips: సాధారణ చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా సైడ్‌ఎఫెక్ట్స్‌లేని ఈ సింపుల్ చిట్కాలు మీకోసం

Ayurvedic Tips for Skin Problems: రోజు రోజుకీ మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వస్తున్న మార్పులు చర్మంపై కూడా ప్రభావం..

Skin Problems-Ayurveda Tips: సాధారణ చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా సైడ్‌ఎఫెక్ట్స్‌లేని ఈ సింపుల్ చిట్కాలు మీకోసం
Ayuveda Skin Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2021 | 10:42 PM

Ayurvedic Tips for Skin Problems: రోజు రోజుకీ మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వస్తున్న మార్పులు చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక సీజన్ లో వస్తున్న మార్పులు కూడా చర్మం వ్యాధులను కలిగిస్తాయి. అయితే ప్రతి చిన్న చిన్న వ్యాధులకు ఆసుపత్రి వెళ్లడం.. యాంటిబయాటిక్ మెడిసిన్స్ వాడడం వలన సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. కనుక చిన్న చిన్న చర్మవ్యాధులను ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చు.

* వేపచెట్టు చర్మరోగాలకు మంచి మెడిసిన్. వేప బెరడు కషాయం సేవిస్తే చర్మరోగాలు నయమవుతాయి. * మెట్టతామర ఆకు పసర, నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని చర్మం పై అప్లై చేస్తే.. సాధారణ చర్మరోగాలు నయమవుతాయి. * వావింటి చెట్టుని నీటితో కలిసి నూరి ముద్దచేసి దానిని నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని చర్మంపై రాస్తే.. చర్మరోగాలు నివారింపబడతాయి. * జిల్లేడాకు రసం, ఆవనూనె, పసుపు కలిపిన ఈ మిశ్రమం కూడా మంచి మందు. * పచ్చగన్నేరు వేరు పైన చర్మం నేతిలో వేసి వేడి చేసి.. ఆ తైలం కూడా మంచి ఔషధం. * నేలవేము కషాయం తాగినా చర్మరోగాలు తగ్గుతాయి. * మోదుగ విత్తనాలను తీసుకుని నిమ్మరసంతో కలిపి అరగదీసిన దురద దద్దుర్లపై బాధపడేవారి రాస్తే విముక్తి కలుగుతుంది. * నల్ల ఉమ్మెత్త రసం రాసిన చర్మరోగాలు నయం అగును. * కొబ్బరినూనెలో గంధం పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేస్తే.. చర్మ రోగాలు నివారింపబడతాయి. * ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ నూనె కూడా చర్మ రోగాలను నివారిస్తుంది. * గజ్జి, చిడుము వంటి చర్మరోగాలు నివారణకు కసివిందాకు రసం మంచి మెడిసిన్. * పనస ఆకులు కూడా చర్మవ్యాధులను నివారిస్తుంది. * తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి రాసినా దూరదతో ఉండే చీముపొక్కులు తగ్గుతాయి.

ఈ ప్రాచీన ఆయుర్వేద ఔషదాలు సింపుల్ చిట్కాలు ఏది అందుబాటులో ఉంటె వాటిని పాటించి చర్మ వ్యాధుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందండి.

Also Read:  స్త్రీలు స్తనాల వాపులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆకులు దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే..