SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..
siima awards 2021 winners list: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్( సైమా ) అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు తారాలోకం తరలివచ్చింది.
SIIMA Awards 2021: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్( సైమా ) అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు తారాలోకం తరలివచ్చింది. ప్రతీ ఏడాది వైభవంగా జరిగే ఈ వేడుకలను.. కరోనా కారణంగా మూడేళ్ళుగా నిర్వహించలేదు. అయితే 2019 ఏడాదికి సంబంధించిన ‘సైమా’ అవార్డులను ఈ ఏడాది ప్రధానం చేశారు. ఈ వేడుకలో అవార్డులు అందుకున్న వారు ఎవరంటే..ఉత్తమ చిత్రం- జెర్సీ (సితార ఎంటర్టైన్మెంట్స్)..ఉత్తమ వినోదాత్మక చిత్రం- ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్).. ఉత్తమ దర్శకుడు- వంశీ పైడిపల్లి (మహర్షి)..ఉత్తమ నటుడు- మహేష్ బాబు (మహర్షి).. ఉత్తమ నటుడు(క్రిటిక్స్)- నాని (జెర్సీ).. ఉత్తమ నటి- సమంత (ఓ బేబీ).. ఉత్తమ నటి (క్రిటిక్స్)- రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్).. ఉత్తమ సహాయ నటుడు- అల్లరి నరేష్ (మహర్షి).. ఉత్తమ సహాయ నటి -లక్ష్మీ (ఓ బేబీ).. ఉత్తమ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి).. ఉత్తమ గేయ రచయిత-శ్రీమణి (ఇదే కదా.. మహర్షి).. ఉత్తమ గాయకుడు- అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)..ఉత్తమ గాయని- చిన్మయి (ప్రియతమా.. మజిలీ).. ఉత్తమ విలన్- కార్తికేయ గుమ్మకొండ (గ్యాంగ్ లీడర్).. ఉత్తమ డెబ్యూ హీరో- శ్రీ సింహా (మత్తు వదలరా).. ఉత్తమ డెబ్యూ హీరోయిన్-శివాత్మిక రాజశేఖర్ (దొరసాని).. ఉత్తమ తొలి డెబ్యూ డైరెక్టర్ – స్వరూప్ ఆర్ఎస్జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ).. ఉత్త డెబ్యూ ప్రొడ్యూసర్ – స్టూడియో 99 (మల్లేశం).. ఉత్తమ సినిమాటోగ్రాఫర్- సానూ వర్గీస్ (జెర్సీ).. ఉత్తమ కమెడియన్- అజయ్ ఘోష్ (రాజు గారి గది 3)
ఇలా వివిధ క్యాటగిరీల్లో అవార్డుల ప్రధానం జరిగింది. ఈ అవార్డు వేడుకల్లో సూపర్ స్టార్ మహేష్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించారు. సైమా వేదిక పై మహేష్ కూల్ అండ్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ వేడుకల్లో మహర్షి సినిమా 10 విభాగాల్లో నామినేట్ అవ్వగా 5 అవార్డులను అందుకోవడం విశేషం..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..