AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

అనుష్క.. ఇప్పటీ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే అనుష్కనే అని చెప్తారు తెలుగు ప్రేక్షకులు. కింగ్ నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..
Anushka
Rajeev Rayala
|

Updated on: Sep 19, 2021 | 10:42 AM

Share

Anushka Shetty : అనుష్క.. ఇప్పటీ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే అనుష్కనే అని చెప్తారు తెలుగు ప్రేక్షకులు. కింగ్ నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ.. దూసుకుపోయింది అనుష్క. ఇక దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళనాట కూడా అనుష్క సక్సెస్ అయ్యింది. అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టి ఆకట్టుకుంది అనుష్క. ఇక కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించింది అనుష్క. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో అనుష్క ఒక్కసారిగా టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ సినిమాలో అనుష్క నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో నటించింది స్వీటీ. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని దక్కించుకుంది.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో అనుష్క రేంజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. బాహుబలి సినిమా తర్వాత భాగమతి అనే సినిమా చేసింది అనుష్క. ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమా చేసింది అనుష్క. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు అనుష్క మరో విభిన్నమైన పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. చంద్రముఖి సినిమా సీక్వెల్‌లో అనుష్క నటించనుందని తెలుస్తుంది.  రజనీకాంత్ .. నయనతార .. ప్రభు .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చంద్రముఖిమూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని దర్శకుడు లారెన్స్ ప్రయత్నిస్తున్నారు. టైటిల్ రోల్ కోసం అనుష్క అయితే బాగుంటుందని భావించిన ఆయన ఆమెను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

Salman Khan : చిన్న యాడ్ కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న సల్మాన్.. ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Surya: భయపడకండి.. నీట్‌ పరీక్షపై ఆందోళన వద్దు.. విద్యార్థులకు హీరో సూర్య సందేశం

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..