Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan : చిన్న యాడ్ కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న సల్మాన్.. ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.

Salman Khan : చిన్న యాడ్ కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న సల్మాన్.. ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Salman
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2021 | 8:50 AM

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ సినిమా వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. ఇక సల్మాన్ రెమ్యునరేషన్ కూడా భరీగా ఉంటుంది. ఇక బాలీవుడ్‌లో సల్మాన్ . షారుక్ మధ్య వార్ గురించి తెలిసిందే. ఇద్దరి మధ్య అనేక విబేధాలు రావడంతో కొన్ని సంవత్సరాలపాటు మాటలు కూడా లేకుండా పోయాయి. ఇక ఈ ఇద్దరి మధ్య వైరాన్ని తొలగించింది సల్మాన్ సోదరి. 2014 లో అర్పితా ఖాన్ వివాహంలో ఒకరితో ఒకరు కలిసిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు షారుక్ ఖాన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమాల్లో అలరిస్తూనే బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు షారుక్. అలాగే సల్మాన్ కూడా అటు సినిమాల్లో ఇటు టీవీషోలో తన మార్క్‌ను చూపించారు.

ఇక ఇప్పుడు షారుక్ ఓటీటీలోకి అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థ షారుక్ ఎంట్రీని కన్ఫామ్ చేసింది. అయితే  షారుక్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వడం కోసం సల్మాన్‌ను రంగంలోకి దింపిందట ఆ సంస్థ. షారుక్ ఎంట్రీని ఖరారు చేస్తూ సల్మాన్ ఓ ఓటీటీ యాడ్‌లో నటించబోతున్నారు. అయితే ఇందుకోసం సల్మాన్ భారీగా రెమ్యునరేషన్ అందుకోనున్నాడని తెలుస్తుంది. కేవలం కొన్ని నిమిషాల యాడ్ కోసమే సల్మాన్‌కి 50 లక్షలు పారితోషికం ఇస్తున్నారుట. ఇలా ఓ స్టార్ హీరో ఎంట్రీనికోసం మరో స్టార్ హీరో రావడం ఇదే తొలిసారి. అలాగే ఇంత చిన్న యాడ్ కోసం 50 లక్షలు ఛార్జ్ చేస్తోన్న హీరో కూడా సల్మాన్ ఒక్కడే కావడం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: అమ్మబాబోయ్ ఇంత డ్రామా ఆడిందా.. వీడియో ప్లే చేసి మరీ సిరి బండారం బయటపెట్టిన నాగార్జున..

Love Story: పొలాండ్‌ కుర్రాడి నోట లవ్‌ స్టోరీ పాట.. కుర్రాడి డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.

Samantha Fan Tattoo: సమంత నా ఫస్ట్ లవ్ అంటూ అభిమాని చేతిపై టాటూ తో ఫోటోలు విడుదల…

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..