Bigg Boss 5 Telugu: అమ్మబాబోయ్ ఇంత డ్రామా ఆడిందా.. వీడియో ప్లే చేసి మరీ సిరి బండారం బయటపెట్టిన నాగార్జున..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 19, 2021 | 7:05 AM

బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ గురించి ప్రేక్షకులను ప్రతిరోజు చర్చించుకుంటున్నారు. గత నాలుగు సీజన్స్ కంటే ఈ సీజన్‌లో హంగామా కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.

Bigg Boss 5 Telugu: అమ్మబాబోయ్ ఇంత డ్రామా ఆడిందా.. వీడియో ప్లే చేసి మరీ సిరి బండారం బయటపెట్టిన నాగార్జున..
Siri

Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ గురించి ప్రేక్షకులను ప్రతిరోజు చర్చించుకుంటున్నారు. గత నాలుగు సీజన్స్ కంటే ఈ సీజన్‌లో హంగామా కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక వారాంతం వచ్చిందంటే నాగార్జున ఎంట్రీ ఇస్తుంటారు. నాగ్ ఎంట్రీతో హౌస్‌లో జోష్ రెట్టింపు అవుతుంది. ఈ వారం జరిగిన ఎపిసోడ్స్ మొత్తం మీద సిరి చేసిన రచ్చే హైలైట్ అని చెప్పాలి. ఏకంగా సన్నీ తన టీ షర్ట్‌లో చేయిపెట్టాడంటూ పెద్ద ఆరోపణే చేసింది సిరి. దాంతో అందరు సన్నీని విలన్‌గా చూశారు. ప్రేక్షకులంతా సన్నీని ఆడిపోసుకున్నారు. ఇంటిసభ్యులు కూడా సన్నీ గురించి తెగ మాట్లాడుకున్నారు. ఇక ఆ ఎపిసోడ్ మొత్తంమీద సిరి యాక్టింగ్ అందరిచేత వావ్ అనిపించింది. అయితే సిరి అసలు బండారాన్ని బయటపెట్టాడు కింగ్ నాగార్జున.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరయు.. సిరి ఆటను తప్పు బట్టిన విషయం తెలిసిందే. బయటకు వచ్చాక సిరి పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది సరయు. హౌస్‌లో సిరి చాలా నాటకాలు ఆడుతుందని… షన్నుతో కలిసి గేమ్ ప్లే చేస్తుందని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది సరయు. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో సిరిని సన్నీ నీ షర్ట్‌లో చేయిపెట్టడం నిజమేనా? నువ్ హౌస్‌లో చేస్తున్నవన్నీ రైట్ అని అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు నాగ్. దానికి సిరి అవును చేయి పెట్టి తీశాడు’ అని చెప్పింది. ఆ సమయంలో శ్వేతా కూడా అక్కడే ఉంది అని చెప్పింది సిరి. ఇదే ప్రశ్న శ్వేతను అడగగా.. సన్నీ చేయిపెట్టడం నేను చూడలేదు అని అంది శ్వేత. షణ్ముఖ్ నువ్ చూశావా?? ఆమె టీషర్ట్‌లో సన్నీ చేయిపెట్టాడా? అని అడగడంతో.. అవును సార్ అతని చేయిని టీషర్ట్ లోపల చూశా అని చెప్పాడు. ఇదంతా ఎందుకులే అని వీడియో ప్లే చేసి చూపించాడు నాగ్. అయితే ఆ వీడియోలో సన్నీ సిరి టీషర్ట్‌లో చేయి పెట్టలేదని క్లియర్‌గా కనిపించింది. సిరి టీషర్ట్ లోపల చేయి పెట్టింది సిరి అని కనిపిస్తుంది. దాంతో వెంటనే ప్లేట్ మార్చేసింది సిరి . ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్..అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా విడుదలకు రంగం సిద్ధం.. రిపబ్లిక్‌ వచ్చేది ఎప్పుడంటే..

Viral Photo: పరుగు పందెంలో విజేతగా నిలిచిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ముక్కుసూటి తనానికి పెట్టింది పేరు ఈ స్టార్‌ హీరోయిన్‌..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి.. 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu