AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: పరుగు పందెంలో విజేతగా నిలిచిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ముక్కుసూటి తనానికి పెట్టింది పేరు ఈ స్టార్‌ హీరోయిన్‌..

Viral Photo: సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ తారలు తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికతో...

Viral Photo: పరుగు పందెంలో విజేతగా నిలిచిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ముక్కుసూటి తనానికి పెట్టింది పేరు ఈ స్టార్‌ హీరోయిన్‌..
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 19, 2021 | 2:36 PM

Share

Viral Photo: సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ తారలు తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు సవాళ్లు సైతం విసురుతున్నారు. తాము చిన్నతనంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ట్రీట్‌ ఇస్తున్నారు. తమ అరుదైన ఫొటోలను పంచుకుంటూ ఇటు మీడియా దృష్టిని సైతం ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో అందాల తార తాను చిన్న తనంలో పాల్గొన్న పరుగుల పందెంకు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

ఝుమ్మంది నాథం సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార తాప్సీనే పైన ఫొటోలో ఉన్న చిన్నారి. చిన్నతనంలో పాల్గొన్న ఓ పరుగుల పందెంలో విజయాన్ని సాధించిన సమయంలో తీసిన ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘చిన్నప్పటి నుంచి చాలా వేగంగా పరిగెత్తేదాన్ని’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలో అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చేరిన ఈ చిన్నది. ముఖ్యంగా బాలీవుడ్‌లో తన సత్తా చాటింది. ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

అంతేకాకుండా ఏ విషయాన్నైనా మనసులో ఉన్నది ఉన్నట్లు చెబుతూ ముక్కుసూటి తనానికి మారుపేరుగా నిలిచిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తప్పడ్‌, బద్లా, గేమ్‌ ఓవర్‌, పింక్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ను తనవైపు తిప్పుకుంది. ఇక ఈ అమ్మడు నటనకు ఎన్నో అవార్డులు దాసోహమయ్యాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ చిన్నది తాజాగా నిర్మాతగా మారి సినిమాలు కూడా తెరకెక్కించే పనిలో పడింది.

Also Read: MLA Rajini: ఏపీ మహిళా ఎమ్మెల్యేకు తెలంగాణలో ఇంత క్రేజా.! కరీంనగర్‌ వ్యక్తి తన అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి..

Disha Police Station: ఏపీ సర్కార్ సహా.. దిశ పోలీస్ స్టేషన్ల పని తీరు అద్భుతం అంటూ పార్లమెంట్‌ కమిటీ ప్రశంసలు..

ఈ వ్యక్తి రోజు అర్ధగంట మాత్రమే నిద్రపోతాడు..! 12 ఏళ్లుగా ఇదే చేస్తున్నాడు.. ఎవరో తెలుసా..?

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..