ఈ వ్యక్తి రోజు అర్ధగంట మాత్రమే నిద్రపోతాడు..! 12 ఏళ్లుగా ఇదే చేస్తున్నాడు.. ఎవరో తెలుసా..?
Japanese Man: నిద్రని ఇష్టపడని వ్యక్తులుంటారా..! అస్సలు ఉండరు అంతేకాక నిద్రభంగాన్ని అస్సలు తట్టుకోలేరు.. ఒక వ్యక్తి శరీరం
Japanese Man: నిద్రని ఇష్టపడని వ్యక్తులుంటారా..! అస్సలు ఉండరు అంతేకాక నిద్రభంగాన్ని అస్సలు తట్టుకోలేరు.. ఒక వ్యక్తి శరీరం అలసటను తొలగించడానికి 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జపాన్‌కు చెందిన ఈ వ్యక్తి 12 సంవత్సరాలుగా కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్ర పోతున్నానని చెబుతున్నాడు. అంతేకాదు తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని వాదిస్తున్నాడు. 36 ఏళ్ల డైసుకే హోరి.. తక్కువ సమయం నిద్రించడానికి 12 సంవత్సరాల పాటు తనకు తానుగా శిక్షణ పొందుతున్నానని చెబుతున్నాడు.
” తన నిద్రపై తనకు చాలా నియంత్రణ ఉందని 24 గంటల్లో కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతానని పేర్కొన్నాడు. అయినప్పటికీ అలసట అనిపించదని బహిరంగంగా వెల్లడించాడు” డైసుకే జపాన్ షార్ట్ స్లీప్ అసోసియేషన్ ఛైర్మన్. అతడు తమతో పాటు ఇతరులకు కూడా తక్కువ నిద్రపోయేలా శిక్షణ ఇస్తాడు. సమయం లేకపోవడం వల్ల ప్రజలు చేయలేని పనులు చాలా ఉన్నాయని డైసుకే చెప్పాడు. ఈ కారణంగానే అతను రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోయేలా శిక్షణ పొందాడు. డైసుకే గురించిన వార్తలు జపాన్‌లో మీడియాకు చేరుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.
స్థానిక న్యూస్ ఛానెల్ డైసుకే దావా గురించి ప్రత్యేక కార్యక్రమం కూడా చేసింది. మూడు రోజుల పాటు నాన్ స్టాప్‌గా ఛానెల్ వాళ్లతో గడిపాడు. ఈ సమయంలో కెమెరా అన్ని సమయాలలో ఉంది. డైసుకే చేస్తున్నది పూర్తిగా నిజం అని ఛానెల్ కనుగొంది. అంతేకాదు అతను కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నట్లు తెలిసింది. డైసుకే 26 నుంచి 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతాడు అలారం లేకుండా మేల్కొంటాడు. ఆసక్తికరంగా డైసుకే లాగా అతని స్నేహితులు కూడా తక్కువ నిద్రపోతున్నారని ఛానెల్ చెబుతోంది. అయితే తక్కువ నిద్ర కారణంగా తాను చాలా కాఫీ తాగుతానని డైసుకే చెప్పారు. ఇందులో కెఫిన్ ఉంటుంది కనుక ఇది వారికి తక్కువ నిద్రపోయేలా చేస్తుంది.