అన్నం వండేటప్పుడు జాగ్రత్త..! సరైన పద్దతిలో ఉడికించకపోతే క్యాన్సర్ ప్రమాదం..? తెలుసుకోండి..
Cooking Rice: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువగా వరి, గోధుమ పండిస్తారు. ఇందులో చాలామంది అన్నం ఆహారంగా స్వీకరిస్తారు.
Cooking Rice: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువగా వరి, గోధుమ పండిస్తారు. ఇందులో చాలామంది అన్నం ఆహారంగా స్వీకరిస్తారు. బియ్యం ద్వారా అన్నం వండుతారు. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. అయితే అన్నం వండుకోవడం చాలా సులభం. కానీ బియ్యాన్ని సరైన పద్దతిలో ఉడికించకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాక శరీరానికి కూడా మంచిదికాదంటున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
ఈ రోజు మనం తినే ఆహారాలు రసాయనాలతో నిండి ఉంటున్నాయని అందరికి తెలుసు. మన జీవనశైలిలో మనకు తెలియకుండానే వీటిని తీసుకుంటున్నాం. అయితే భవిష్యత్‌లో ఇది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంగ్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్శిటీ బెల్‌ఫాస్ట్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. కీటకాల నుంచి వరిని కాపాడటం కోసం, అధిక దిగుబడుల కోసం రైతులు విపరీతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందులను ఉపయోగిస్తున్నారు. ఇది వరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఎఫెక్ట్ వరితో తయారయ్యే బియ్యంపై కూడా పడుతుంది.
ఈ బియ్యంతో వండుతున్న అన్నం తినడం వల్ల ఎంతో కొంత రసాయనాలు మన శరీరంలోకి వెళుతున్నాయని తేల్చారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు. అయితే అన్నం వండటానికి ముందు బియ్యాన్ని సరైన పద్దతిలో ఉడికించాలని సూచిస్తున్నారు. లేదంటే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాక ఉత్తమమైన మార్గం ఏంటంటే అన్నం వండటానికి ముందు రాత్రిపూట బియ్యాన్ని నీటిలో నానబెట్టడం మంచిది. దీని కారణంగా బియ్యంలో ఉండే టాక్సిన్స్ 80 శాతం తగ్గుతాయని తెలిపారు.