TTD News: టీటీడీ జంబో బోర్డు వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆయన పేరును సిఫార్సు చేయలేదంటూ కిషన్ రెడ్డి లేఖ

Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) జంబో బోర్డు ఏర్పాటుపై మొదలైన రాజకీయ దుమారం కొత్త మలుపు తిరిగింది. ఈవిషయంపై ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

TTD News: టీటీడీ జంబో బోర్డు వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆయన పేరును సిఫార్సు చేయలేదంటూ కిషన్ రెడ్డి లేఖ
Tirumala Temple
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 18, 2021 | 6:20 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) జంబో బోర్డు ఏర్పాటుపై మొదలైన రాజకీయ దుమారం కొత్త మలుపు తిరిగింది. ఈవిషయంపై ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం తాను ఎవరినీ సిఫారసు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన సిఫార్సు మేరకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా వై.రవిప్రసాద్‌‌ను నియమించినట్లు కొన్ని మీడియా వర్గాల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. టీటీడీ బోర్డు పదవి కోసం రవిప్రసాద్ పేరును తాను ఎవరికీ సిఫార్సు చేయలేదని కిషన్‌రెడ్డి తన లేఖలో స్పష్టంచేశారు.

వ్యక్తిగతంగా కానీ, కేంద్ర పర్యాటక శాఖ తరఫున గానీ… టీటీడీ బోర్డులో పదవి కోసం ఎవరినీ సూచించలేదని ఆ లేఖలో కిషన్ పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకుని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో 81 మందితో టీటీడీ జంబో బోర్డు ఏర్పాటు చేశారని ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా కిషన్‌రెడ్డి లేఖతో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది.

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖ..

రెండ్రోజుల క్రితం 25 మందితో టీటీడీకి కొత్త బోర్డును ఏపీ సర్కారు నియమించడం తెలిసిందే. ఈ బోర్డులో మునుపటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు చెందినవారికి ప్రాతినిధ్యంకల్పించారు. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది సభ్యులకు ప్రభుత్వం చోటు కల్పించింది.

Also Read..

Samantha: తిరుమలలో ఆ ప్రశ్శ అడిగినందుకు అసహనం వ్యక్తంచేసిన సమంత.. బుద్ధి ఉందా అంటూ..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు.. ఆ జిల్లాలో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి