Andhra Pradesh: సీఎం జగన్‌పై అయ్యన్న కామెంట్స్.. ఎమ్మెల్యే రోజా రియాక్షన్ మామూలుగా లేదు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి.

Andhra Pradesh: సీఎం జగన్‌పై అయ్యన్న కామెంట్స్.. ఎమ్మెల్యే రోజా రియాక్షన్ మామూలుగా లేదు..
MLA Roja (File Photo)
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 18, 2021 | 11:03 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా అయ్యన్నపాత్రుడి కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. ఆయన చేసిన కామెంట్స్‌ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. శనివారం నాడు ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు.. కోడెలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమైపోయారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలని సూచించారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున లాంటివారు కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. జన నాయకుడు జగన్ అని, అలాంటి నేతలపై కారుకూతలు కూస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ‘‘ఇలాంటి చర్యల కారణంగా జనాలు అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే పదవి పీకేశారు.. మంత్రి పదవి పీకేశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పీకేశారు.. రాష్ట్రంలో తెలుగుదేశం జెండాను పీకేశారు.. ఇంకా ఏం పీకేయాలి?.’’ అంటూ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే రోజా. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదిలాఉంటే.. ఎస్పీ లను పరుద పదజాలంతో దూషించిన అయ్యన్నపాత్రుడిపై ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్‌ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం అని సంఘం అధికారులు పేర్కొన్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. రాజకీయ విశృంఖలత్వం మితిమీరక ముందే ఇటువంటి ప్రవర్తనను సభ్య సమాజం గర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న తమ పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని అయ్యన్న తీరును ప్రశ్నించారు అధికారులు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని, శాంతి భద్రతల పరిరక్షణకై అనునిత్యం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థను తులనాడడంలో ఔచిత్యం ఏమిటో ఆలోచించుకోవాలని హితవు చెప్పారు. ఇష్టానుసారంగా మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దని, పరిధిని అతిక్రమించి మాట్లాడొద్దు అని అయ్యన్నకు ఐపీఎస్ అధికారులు సూచించారు.

Also read:

Maharshi Movie : మహేష్ ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. బెస్ట్ యాక్టర్‌గా మరోసారి సూపర్ స్టార్..

Share Market: ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే కాసుల పంట.. రూ. లక్ష పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..!

Allu Arjun: మేడమ్ సర్ మేడమ్ అంతే.. అల వైకుంఠపురంలో క్రేజ్ అస్సలు తగ్గడంలేదుగా….