Gangavalli Kura: వయసుతో పాటు వచ్చే ఎముకల వ్యాధులను నివారించే అద్భుతమైన ఆకు కూర ‘గంగవెల్లి’..ఎక్కడైనా కనిపిస్తే వదలకండి..
Gangavalli kura: మన పూర్వికులు చేలగట్లమీద, తోటల్లో లభ్యమయ్యే సహజమైన ఆకుకూరలను, కూరగాయలను తిని ఎంతో ఆరోగ్యంగా జీవించారు. అందుకనే 60 ఏళ్ళు దాటినా ఎంతో శక్తివంతంగా..
Gangavalli kura: మన పూర్వికులు చేలగట్లమీద, తోటల్లో లభ్యమయ్యే సహజమైన ఆకుకూరలను, కూరగాయలను తిని ఎంతో ఆరోగ్యంగా జీవించారు. అందుకనే 60 ఏళ్ళు దాటినా ఎంతో శక్తివంతంగా పళ్ళు కూడా ఊడిపోకుండా హ్యాపీగా నిండునూరేళ్ళు బతికేవారు. అయితే ఆధునికత పేరుతొ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానము మారింది. దీంతో అనారోగ్యాలు మన సొంతమయ్యాయి. 60 ఏళ్లలో రావాలిన కళ్ళజోడు… 6 ఏళ్లకే వచ్చే స్టేజ్ కు చేరుకున్నాం.. అయితే ఈరోజు పల్లెటూర్లలో ఎక్కడబడితే అక్కడ కనిపించే గంగవాయిల కూర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి.. తెలుసుకుందాం. గంగవాయిల(గంగవెల్లి) ఆకు కూర అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందుకనే ఆయుర్వేదంతో కొన్ని వ్యాధుల చికిత్స కోసం ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు.
ఈ మొక్కలో విటమిన్లు, ఖనిజాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉన్న విటమిన్ ఎ కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కణ విభజనకు మద్దతు ఇస్తుంది.
ఇక ఇందులో పుష్కలంగా ఉన్న విటమిన్ సి .. మన శరీరంలోని కొల్లాజెన్ , రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, అలాగే గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది. ,
*గంగవాయిల (గంగవెల్లి) కూరలో అధికంగా బీటా కెరోటిన్ ఉంది. దీని కాండం, ఆకుల ఎర్రటి రంగుకు కారణమైన వర్ణద్రవ్యం. ఈ ఆకులలో కనిపించే అనేక యాంటీఆక్సిడెంట్లలో బీటా కెరోటిన్ ఒకటి. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తాయని అనేక పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రీ రాడికల్స్ సెల్యులార్ డ్యామేజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆకు కూరల్లో గంగవెల్లి ముఖ్యమైంది. అందుకనే హృదయాన్ని భద్రంగా కాపాడుతుంది. ధమనులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు హార్ట్ ఎటాక్, ఇతర గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
* ఈ మొక్కలో ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అందువలన ఎముకలు బలహీనపడి.. వచ్చేబోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. అంతేకాదు ఈ ఆకూ కూరను తరచుగా తీసుకోవడం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి తో పాటు వృద్ధాప్యం తో వచ్చే ఎముకల సమస్యలను నివారిస్తుంది.
Also Read: Two Sets of Identical Twins: జీన్స్ మూవీని మించిన ప్రేమకథ.. కవల అక్కాచెల్లెళ్లను ప్రేమించిన కవల అన్నాదమ్ములు..