MLA Rajini: ఏపీ మహిళా ఎమ్మెల్యేకు తెలంగాణలో ఇంత క్రేజా.! కరీంనగర్‌ వ్యక్తి తన అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి..

Vidadala Rajini: సినీ తారలకు అభిమానులు ఎక్కువగా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అదే స్థాయిలో రాజకీయ నాయకులను కూడా అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే...

MLA Rajini: ఏపీ మహిళా ఎమ్మెల్యేకు తెలంగాణలో ఇంత క్రేజా.! కరీంనగర్‌ వ్యక్తి తన అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి..
Follow us

|

Updated on: Sep 18, 2021 | 7:15 PM

Vidadala Rajini: సినీ తారలకు అభిమానులు ఎక్కువగా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అదే స్థాయిలో రాజకీయ నాయకులను కూడా అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నాయకులపై తమకున్న ఇష్టాన్ని రకరకాలుగా చూపిస్తుంటారు. కొందరు భారీ ఫ్లెక్సీలు కడితే, మరికొందరి గజ మాలలు వేస్తూ అభిమానానాన్ని చాటుకుంటారు. అయితే దాదాపు చాలా మంది తమ ప్రాంతానికి చెందిన నాయకులనే మాత్రమే అభిమానిస్తుంటారు. కానీ తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యేకు వీరాభిమానిగా మారాడు. అభిమానంతో తాను చేసిన పనితో ఏకంగా నేతగా ఆకట్టుకునేలా చేశాడు.

Rajini 1

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లికి చెంది దూడం అనిల్‌కు గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అంటే పిచ్చి అభిమానం. ఈ క్రమంలోనే తన అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఎమ్మెల్యే రజిని ఫొటోను పచ్చబొట్టు రూపంలో చేయిపై వేయించుకున్నాడు. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. చివరకు ఎమ్మెల్యే కంటపడింది. దీంతో వెంటనే అనిల్‌ను శుక్రవారం చిలకలూరిపేట పిలిపించుకున్న ఎమ్మెల్యే ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా అనిల్‌ కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యువకుడికి రూ. 50,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఉద్యోగం కూడా ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలను చూసి అభిమానిగా మారినట్లు చెప్పుకొచ్చాడు.

Rajini

Also Read: హస్తం పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. కదులుతున్న కాంగ్రెస్ పునాదులు.. ఈ దుస్థితికి కారణాలేంటి?

Statue of Equality: పుడమి పుణ్యం.. భగవద్రామానుజుల జననం..! భారతావని సుకృతం.. ఆ సమతామూర్తి దివ్య విగ్రహం..!!

అన్నం వండేటప్పుడు జాగ్రత్త..! సరైన పద్దతిలో ఉడికించకపోతే క్యాన్సర్‌ ప్రమాదం..? తెలుసుకోండి..